త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Living In Matchboxes | అగ్గిపెట్టెలో జీవించిన‌ట్లుంది.. ఓ గృహిణి ఆవేద‌న ఇదీ..! వీడియో

Living In Matchboxes | ప్ర‌తి ఒక్క‌రికి సొంతింటి క‌ల ఉంటుంది. ఆ సొంతింటి క‌ల కూడా అనేక ర‌కాల కోరిక‌ల‌ను పుట్టిస్తుంది. కొంద‌రికేమో.. అపార్ట్‌మెంట్‌లో ఉండాల‌నే కోరిక ఉంటే.. మ‌రికొంద‌రికేమో సొంతంగా ఒకే ఇల్లు ఉండాల‌నే కోరిక ఉంటుంది. ఇ

S

National | Published On Apr 12, 2026, 8.09 am IST

Living In Matchboxes | అగ్గిపెట్టెలో జీవించిన‌ట్లుంది.. ఓ గృహిణి ఆవేద‌న ఇదీ..! వీడియో
Advertisement

Living In Matchboxes | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌తి ఒక్క‌రికి సొంతింటి క‌ల ఉంటుంది. ఆ సొంతింటి క‌ల కూడా అనేక ర‌కాల కోరిక‌ల‌ను పుట్టిస్తుంది. కొంద‌రికేమో.. అపార్ట్‌మెంట్‌లో ఉండాల‌నే కోరిక ఉంటే.. మ‌రికొంద‌రికేమో సొంతంగా ఒకే ఇల్లు ఉండాల‌నే కోరిక ఉంటుంది. ఇక త‌క్కువ‌లో త‌క్కువ 200 గ‌జాల‌కు పైగా ఇల్లు ఉండాల‌నే కోరిక కూడా ఉంటుంది. అపార్ట్‌మెంట్ల‌లో అయితే ఇరుకుఇరుకుగా ఫ్లాట్స్ ఉంటాయి. ఈ అపార్ట్‌మెంట్లు ఇప్పుడు ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తున్నారు.

అయితే ఓ గృహిణి.. హైరైజ్ అపార్టుమెంట్‌లోని త‌న ఇరుకైన ఫ్లాట్ గురించి ఇన్‌స్టాలో ఓ వీడియో విడుద‌ల చేసింది. నేను 19వ అంత‌స్తులో ఉంటున్నాను. ఇంటి బాల్క‌నీ నుంచి కింద‌కు చూస్తే ప‌లు దృశ్యాలు క‌నిపించాయి. కొంద‌రు యోగా చేస్తున్నారు. ఇంకొంద‌రు పిల్ల‌లు ఆ స‌మీపంలోనే క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్ ఆడేవారిలో నా కుమారుడు కూడా ఉన్నాడు. న‌లుపు రంగు టీ ష‌ర్ట్ ధ‌రించి కారు ద‌గ్గ‌ర నిల‌బ‌డి ఉన్న పిల్లాడు నా కుమారుడే అని పేర్కొంటూ.. ఈ ఇరుకైన ఫ్లాట్స్‌లో జీవించ‌డాన్ని ఆమె అగ్గిపెట్టెతో పోల్చారు. అగ్గిపెట్టెంత ఇంట్లో నివసించ‌డం కాస్త ఇబ్బందే అని ఆమె చెప్ప‌క‌నే చెప్పారు.

ఈ వీడియో ఇన్‌స్టాలో విడుద‌లైన త‌ర్వాత‌.. ఆయా మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. హైరైజ్ అపార్ట్‌మెంట్ జీవితంపై ఆ గృహిణి అభిప్రాయాల‌తో కొంత మంది నెటిజ‌న్లు ఏకీభ‌వించారు. కొంద‌రేమో.. త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ఒక వేళ లిఫ్ట్ పని చేయ‌క‌పోతే ప‌రిస్థితి ఏంటి..? అని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించ‌గా, మ‌రో నెటిజ‌న్ స్పందిస్తూ.. ఈ అగ్గిపెట్టె ఇల్లుకు 20 నుంచి 30 ఏండ్లు ఈఎంఐ క‌ట్టాల్సి వ‌స్తుంద‌ని పెద‌వి విరిచాడు.

Advertisement
Advertisement