Diaper | పసికందు ప్రాణాలు కాపాడిన ‘డైపర్’
Diaper | డైపరే కదా అని తీసి పారేయకండి.. ఎందుకంటే ఆ డైపరే ఓ పసిపాప ప్రాణాలను కాపాడింది. 20 రోజుల పసికందును కోతి ఎత్తుకెళ్లి బావిలో పడేయగా.. ఆ డైపర్ లైఫ్ జాకెట్‌లా మారి బిడ్డకు ప్రాణం పోసింది.
Diaper | త్రినేత్ర.న్యూస్ : తల్లి ఒడిలో ఉన్న ఓ 20 రోజుల పసికందును కోతి ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత ఆ పసిబిడ్డను స్థానికంగా ఉన్న ఓ బావిలో పడేసింది. కానీ ఆ బిడ్డ ప్రాణాలను డైపర్ కాపాడింది.
ఛత్తీస్‌గఢ్‌లోని సియోని గ్రామానికి చెందిన ఓ తల్లి తన 20 రోజుల పసికందు పాలిస్తూ ఇంట్లోనే కూర్చుంది. ఇంట్లోకి ప్రవేశించిన కోతి.. వాయువేగంతో ఆ బిడ్డను ఎత్తుకెళ్లింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లి లబోదిబోమంటూ గట్టిగా ఏడ్చేసింది. అప్రమత్తమైన స్థానికులు పసికందు ఆచూకీ కోసం గ్రామంతో పాటు శివార్లలో గాలించారు. స్థానికంగా ఉన్న ఓ బావిలో పసిబిడ్డ నీళ్లపై తేలియాడుతూ కనిపించింది.
స్థానికులంతా కలిసి బావిలో ఉన్న పాపను బయటకు తీశారు. అక్కడే ఉన్న నర్సు రాజేశ్వరి రాథోడ్.. పాపకు సీపీఆర్ చేసింది. పసిపాప ఊపిరి తీసుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పాపను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పసిబిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పాప ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు.
డైపర్ వల్లే పాప ప్రాణం నిలిచింది..
పాప డైపర్ ధరించి ఉండడం వల్లే ప్రాణాలతో బయటపడిందని నర్సుతో పాటు స్థానికులు తెలిపారు. ఎందుకంటే డైపర్ వల్ల పాప నీటిలో మునగకుండా పోయింది. డైపర్ లైఫ్ జాకెట్‌లా మారడంతో.. బిడ్డ ప్రాణం నిలిచిందన్నారు. డైపర్ లేకుండా ఉంటే.. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేదన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






