త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sikkim | డేరింగ్ ఆప‌రేష‌న్‌.. 46 మంది ప‌ర్యాట‌కుల‌ను కాపాడిన సైన్యం

Sikkim | తూర్పు సిక్కిం (Sikkim)లో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. నిన్న‌టి నుంచి అక్క‌డ క్లిష్ట‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. భారీగా హిమ‌పాతం (Fresh Snow) కురుస్తోంది.

D

National | Published On Feb 23, 2026, 1.21 pm IST

Sikkim | డేరింగ్ ఆప‌రేష‌న్‌.. 46 మంది ప‌ర్యాట‌కుల‌ను కాపాడిన సైన్యం
Advertisement

Sikkim | తూర్పు సిక్కిం (Sikkim)లో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. నిన్న‌టి నుంచి అక్క‌డ క్లిష్ట‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. భారీగా హిమ‌పాతం (Fresh Snow) కురుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో అనేక మంది ప‌ర్యాట‌కులు చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన సైన్యం 'ఆపరేషన్ హిమ్రాహత్' పేరుతో డేరింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చిక్కుకుపోయిన 46 మంది ప‌ర్యాట‌కుల‌ను (Tourists) సుర‌క్షితంగా కాపాడింది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సైన్యం వేగంగా స్పందించి పర్యాటకులను రక్షించింది.

విప‌రీతంగా మంచు కురుస్తుండ‌టంతో సిక్కింలో ప్ర‌స్తుతం ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్ డిగ్రీల‌కు ప‌డిపోయాయి. రోడ్ల‌పై కొన్ని అడుగుల మేర మంచు పేరుకుపోయింది. రాక‌పోక‌లు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. దీంతో ప‌ర్యాట‌కులు మంచు వాతావ‌ర‌ణంలో చిక్కుకుపోయారు. జవహర్‌లాల్ నెహ్రూ (జెఎన్) రహదారి వెంబడి 16వ మైలు మధ్య సంగు (Tsangu) సమీపంలో సుమారు 350 పర్యాటక వాహనాలు నిలిచిపోయాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే సైన్యం రంగంలోకి దిగి స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించింది. చిక్కుకుపోయిన ప‌ర్యాట‌కుల‌ను ర‌క్షించి స‌మీపంలోని ఆర్మీ క్యాంపుల‌కు (Army Transit Camp) త‌ర‌లించింది. అక్క‌డ వారికి అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాలూ క‌ల్పించారు. ఆహారం, దుస్తులు వంటివి అందించారు. వారికి వైద్య పరీక్ష‌లు కూడా చేయించారు.

కాగా, ఈ నెల 24 వ‌ర‌కూ ఉత్త‌ర‌, తూర్పు సిక్కింలో వ‌ర్షం, మంచు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. అయితే, ప‌శ్చిమ సిక్కింలో పొడి వాతావ‌ర‌ణం కొన‌సాగుతుంద‌ని తెలిపింది.

Advertisement
Advertisement