Ranveer Singh | రూ.10 కోట్లు ఇవ్వండి.. రణ్‌వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
Ranveer Singh | గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi gang) నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు రణ్ వీర్ సింగ్ (Ranveer Singh)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ హరి బాక్సర్ అనే వ్యక్తి నటుడికి వాయిస్ నోట్ పంపాడు.
Ranveer Singh | గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi gang) నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు రణ్ వీర్ సింగ్ (Ranveer Singh)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ హరి బాక్సర్ అనే వ్యక్తి నటుడికి వాయిస్ నోట్ పంపాడు. అమెరికాలో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ (American number) నుంచి ఈ వాయిస్ నోట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ బెదిరింపులపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (Mumbai Crime Branch Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెంబర్‌కు సంబంధించిన వివరాలు కోసం అమెరికా అధికారులను సంప్రదించినట్టు తెలుస్తోంది.
కాగా, వారం రోజుల క్రితం కూడా హరి బాక్సర్ (Harry Boxer) నుంచి రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. "రణ్‌వీర్ సింగ్.. మీ తర్వాతి ఏడు తరాలు గుర్తించుకునేలా నీకు బుద్ధి చెబుతాం. సలహాలు ఇవ్వడం, వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని ప్రజలకు సూచించడం నీకు బాగా అలవాటుగా మారింది. సరే అయితే, నువ్వు కూడా ఫిర్యాదు చేశావు. ఇబ్బందేమీ లేదు. ఇది మాత్రం జాగ్రత్తగా విను. నీ దగ్గర పనిచేసే ప్రతి మేనేజర్, ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి. వారు ఎక్కడ నివసిస్తున్నారు, ఎప్పుడు ఆఫీస్‌కు వస్తారు, ఎప్పుడు వెళ్లిపోతారు, వారి కుటుంబ సభ్యులు ఎవరు.. ఇలా ప్రతీ సమాచారం మా దగ్గర ఉంది. మేము నేరుగా నిన్ను ఏమీ చెయ్యం. నీ కింద పనిచేసే వాళ్ల నుంచి మొదలు పెడతాం. వారందరినీ చంపేస్తాం. అప్పుడు నీకు బుద్ధివస్తుంది. మేం పని మొదలు పెట్టేలోపే మేలుకో" అంటూ అందులో హెచ్చరించాడు. ఇదే హెచ్చరికలు ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty)కి కూడా వర్తిస్తాయిన అందులో పేర్కొన్నాడు. ఇప్పుడు రణ్‌వీర్‌సింగ్‌కు మరోసారి బెదిరింపులు రావడం బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.
సంబంధిత వార్తలు

Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
మే 15, 2026

OTT | ఓటీటీలోకి రెండు వేల కోట్ల బ్లాక్బస్టర్ మూవీ – నాలుగు గంటల రన్టైమ్తో రిలీజ్
మే 8, 2026

Ranveer Singh | కాంతారా వివాదం.. క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్ సింగ్.. నాలుగువారాల్లో ఆలయ సందర్శన..!
ఏప్రిల్ 25, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



