Pakistan | ఇమ్రాన్ ఖాన్‌కు 17 ఏళ్ల జైలుశిక్ష
Pakistan | పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan), ఆయన భార్య బుష్రా బీబీ (Bushra Bibi) లకు తోషఖానా (Toshakhana) అవినీతి కేసులో 17 ఏళ్ల జైలుశిక్ష (Imprisonment) విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరిచింది.
International | Published On Dec 20, 2025, 1.55 pm IST
Pakistan | పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan) కు తోషఖానా (Toshakhana) అవినీతి కేసులో 17 ఏళ్ల జైలుశిక్ష (Imprisonment) పడింది. ఈ మేరకు ఆయనతో పాటు ఆయన భార్య బుష్రా బీబీ (Bushra Bibi) కి సైతం ఇదే శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరిచింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే పలు అవినీతి కేసుల్లో శిక్ష పడి రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తోషఖానా అవినీతి కేసులో జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 1.64 కోట్ల పాకిస్థాన్ రూపాయల జరిమానా కూడా విధించారు. తీర్పుపై తాము హైకోర్టులో అప్పీల్ చేస్తామని ఇమ్రాన్ తరపు న్యాయవాదులు తెలిపారు.
అసలేమిటీ తోషఖానా అవినీతి కేసు...
సాధారణంగా పాకిస్థాన్‌లో ప్రభుత్వ పెద్దలకు అధికారికంగా వచ్చే బహుమతులను ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిగానే పరిగణిస్తారు. ఈ బహుమతులను నిర్వహించే సంస్థ పేరు తోషఖానా. కాగా 2021లో సౌదీలో పర్యటించిన అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దంపతులకు ఆ దేశ యువరాజు ఖరీదైన ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను బహుమతులుగా అందజేశారు. వాటిని తోషఖానాకు అప్పగించకుండా స్వీయ ప్రయోజనాల కోసం వాటిని విక్రయించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. దాంతో పాటు ఆ వస్తువులను అక్రమంగా విక్రయించడం, విలువ తగ్గించడం, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించడం వంటి ఆరోపణలను సైతం ఆ కేసులో చేర్చారు.
తీర్పును తప్పుపడుతున్న ప్రతిపక్షాలు
పాక్ న్యాయస్థానం తీర్పుతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పీటీఐ నేతలు, కార్యకర్తలు తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆందోళనకు దిగారు. ఇతర ప్రతిపక్షాలు సైతం తీర్పును తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇది కేవలం రాజకీయ కక్షతో నమోదు చేసిన కేసుగా అభివర్ణిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

KTR | లోక్‌సభలో బీఆర్ఎస్ సభ్యులుంటే తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించేవాళ్లం : కేటీఆర్
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



