Social Media Ban | అక్కడ 15 ఏండ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
Social Media Ban | చిన్నారులను సోషల్ మీడియా (Social Media) వ్యసనం నుంచి దూరం చేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల మాయలో పడి విద్యతోపాటు ఆరోగ్యాలను పాడుచేసుకున్న యువతను కాపాడేందుకు ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం ఇప్పటికే 16 ఏండ్ల కన్నా తక్కువ వయసున్న వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధం (Social Media Ban) విధించింది.
International | Published On Jan 28, 2026, 1.46 pm IST
త్రినేత్ర.న్యూస్: చిన్నారులను సోషల్ మీడియా (Social Media) వ్యసనం నుంచి దూరం చేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల మాయలో పడి విద్యతోపాటు ఆరోగ్యాలను పాడుచేసుకున్న యువతను కాపాడేందుకు ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం ఇప్పటికే 16 ఏండ్ల కన్నా తక్కువ వయసున్న వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధం (Social Media Ban) విధించింది. తాజాగా ఈ జాబితాలో ఫ్రాన్స్ (France) కూడా చేరనుంది.
15 ఏండ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా ఫ్రెంచ్ ప్రభుత్వం ఓ చట్టం తీసుకురానుంది. దీనికోసం ఉద్దేశించిన బిల్లుకు ఆ దేశ పార్లమెంటులోని దిగువ సభ మద్దతు తెలిపింది. 130-21 మెజారిటీతో బిల్లును దిగువసభ ఆమోదించింది. ఈ మేరకు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) ప్రకటించారు.
సెనెట్‌లో దీనిపై చర్చ జరిపి, బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఫిబ్రవరి చివరికి సెనెట్ ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్‌లో మొదలయ్యే నూతన విద్యాసంవత్సరం నుంచి ఈ నిషేధాన్ని అమల్లోకి తెస్తామన్నారు. పిల్లలు గంటలకొద్దీ సమయాన్ని స్క్రీన్‌కు కేటాయించడం వల్ల వారిలో తలెత్తుతున్న ఆరోగ్య, మానసిక సమస్యలను నివారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మెక్రాన్ వెల్లడించారు. 15 ఏండ్లలోపు పిల్లల ఖాతాలను తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలకు డిసెంబర్ 31 వరకు సమయం ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే టీనేజర్ల సోషల్ మీడియా వాడకంపై దేశవ్యాప్తంగా నిషేధాన్ని ప్రవేశపెట్టిన రెండో దేశంగా ఫ్రాన్స్ నిలుస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం దేశంలోని పదహారేళ్ల కన్నా తక్కువ వయసున్నవారు సోషల్ మీడియా వాడకుండా నిషేధించిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 10 నుంచి ఈ చట్టాన్ని ఆస్ట్రేలియా అమలు చేస్తున్నది.
సంబంధిత వార్తలు

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026

X | ఫ్రీ యూజర్లకు షాకిచ్చిన ఎక్స్.. పోస్టులపై లిమిట్స్ విధింపు..
మే 18, 2026

Bandi Bhageerath | అందరిలాగే నా కూతురికీ రక్షణ, గౌరవం పొందే అర్హత ఉంది.. బండి భగీరథ్ బాధితురాలి తల్లి
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



