త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

School Shooting | పాఠ‌శాల‌లో కాల్పులు.. 10 మంది మృతి

School Shooting | కెన‌డా (Canada )లో కాల్పుల ఘ‌ట‌న‌ క‌ల‌క‌లం రేపింది. ఓ స్కూల్‌లో జ‌రిగిన ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో (Canada School Shooting) 10 మంది వ‌ర‌కూ ప్రాణాలు కోల్పోయారు.

D

International | Published On Feb 11, 2026, 10.28 am IST

School Shooting | పాఠ‌శాల‌లో కాల్పులు.. 10 మంది మృతి
Advertisement

School Shooting | కెన‌డా (Canada )లో కాల్పుల ఘ‌ట‌న‌ క‌ల‌క‌లం రేపింది. ఓ స్కూల్‌లో జ‌రిగిన ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో (Canada School Shooting) 10 మంది వ‌ర‌కూ ప్రాణాలు కోల్పోయారు. 20 మందికిపైగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది ఓ మ‌హిళ‌గా అనుమానిస్తున్నారు. ఆమె కూడా త‌న‌ను తాను కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు.

రాయల్ కెనడియన్ మౌంటెడ్ (Royal Canadian Mounted Police) పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బ్రిటిష్ కొలంబియా (British Columbia) రాష్ట్రం టుంబ్లెర్ రిడ్జ్ సెకండ‌రీ పాఠ‌శాల‌లో (Tumbler Ridge Secondary School) మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాల్పుల ఘ‌ట‌న‌లో ప‌ది మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మంది గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘాతుకానికి పాల్ప‌డింది ఓ మ‌హిళ‌గా అధికారులు అనుమానిస్తున్నారు. కాల్పుల అనంత‌రం పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోనే ఆమె కూడా త‌న‌ను తాను కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

ఈ కాల్పుల్లో పాఠ‌శాల‌కు స‌మీపంలోని ఇళ్ల‌లోని వారు కూడా ప్రాణాలు కోల్పోయిన‌ట్లుగా తెలుస్తోంది. ఓ ఇంట్లో రెండు మృత‌దేహాల‌ను అధికారులు గుర్తించారు. దీంతో ఎవ‌రైనా గాయ‌ప‌డిన వారు ఉన్నారేమో అని పాఠ‌శాల‌కు స‌మీపంలోని ఇళ్ల‌లో అధికారులు సోదాలు జ‌రుపుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల‌కు పాల్ప‌డిన వ్య‌క్తిని గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఆ వివ‌రాలు మాత్రం పోలీసులు వెల్ల‌డించ‌లేదు.

Advertisement
Advertisement