త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Zoo | హైద‌రాబాద్ జూపార్కుకు కంగారూలు..!

Hyderabad Zoo | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని నెహ్రూ జూపార్కు( Nehru Zoo Park )లో కొత్త జంతువులు క‌నిపించ‌బోతున్నాయి. ఈ కొత్త జంతువులు జంతు ప్రేమికులను, ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించనున్నాయి. హైద‌రాబాద్ జూ పార్కు( Hyderabad Zoo Park )కు తొలిసారిగా కంగారూలు( Kangaroo ), వాలాబీలు, రింగ్ టెయిల్డ్ లెమూర్లు, కాసోవ‌రీలు(ఎర‌గ‌లేని ప‌క్షులు) తో పాటు జీబ్రాల‌ను తీసుకురానున్నారు.

S

Hyderabad | Published On Oct 20, 2026, 7.48 am IST

Hyderabad Zoo | హైద‌రాబాద్ జూపార్కుకు కంగారూలు..!
Advertisement

Hyderabad Zoo | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని నెహ్రూ జూపార్కు( Nehru Zoo Park )లో కొత్త జంతువులు క‌నిపించ‌బోతున్నాయి. ఈ కొత్త జంతువులు జంతు ప్రేమికులను, ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించనున్నాయి. హైద‌రాబాద్ జూ పార్కు( Hyderabad Zoo Park )కు తొలిసారిగా కంగారూలు( Kangaroo ), వాలాబీలు, రింగ్ టెయిల్డ్ లెమూర్లు, కాసోవ‌రీలు(ఎర‌గ‌లేని ప‌క్షులు) తో పాటు జీబ్రాల‌ను తీసుకురానున్నారు. ఈ జంతువుల‌ను గుజ‌రాత్ జామ్ న‌గ‌ర్‌లోని అంత‌ర్జాతీయ వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రం వంతారా నుంచి త‌ర‌లించేందుకు సూత్ర‌ప్రాయ అంగీకారం కుదిరింది.

తొలిసారిగా కంగారూలు..

హైదరాబాద్ జూ పార్కు చరిత్రలోనే మొదటిసారిగా ఒక జంట (ఒక మగ, ఒక ఆడ) కంగారూలు రానున్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్, నైట్ హౌస్ ఏర్పాట్లను జూ అధికారులు పూర్తి చేశారు. వంతారా బృందం ఇప్పటికే జూను సందర్శించి ఇక్కడి వసతులను పరిశీలించింది. (గతంలో 2020లో జపాన్‌లోని యోకోహామా జూ నుండి కంగారూలను తీసుకురావాలని ఒప్పందం కుదిరినా, కోవిడ్-19 వల్ల అది సాధ్యపడలేదు).

వాలాబీలు, లెమూర్లు

కంగారూల లాగే ఉండి, సుమారు 3 అడుగుల ఎత్తు ఉండే వాలాబీలతో పాటు మడగాస్కర్ దేశానికి చెందిన 'రింగ్-టెయిల్డ్ లెమూర్లు' కూడా రానున్నాయి. నలుపు, తెలుపు రంగుల వలయాలు ఉన్న పొడవైన తోకలు ఈ లెమూర్ల ప్రత్యేకత. ఇవి ఉదయాన్నే శరీరాన్ని వెచ్చబెట్టుకోవడానికి చేతులు చాచి నిటారుగా కూర్చుంటాయి.

జీబ్రాల రాక

ప్రస్తుతం జూలో ఉన్న మూడు జీబ్రాలతో పాటు, వంతారా నుండి మరో జంట జీబ్రాలు రానున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్ జూలో 320 సరీసృపాలు, 498 క్షీరదాలు, ఎనిమిది ఉభయచరాలతో కలిపి మొత్తం 2,178 జంతువులు ఉన్నాయి.

Advertisement
Advertisement