Hyderabad Zoo | దంచికొడుతున్న ఎండలు.. హైదరాబాద్ జూలో ఏసీలు, కూలర్లు
Hyderabad Zoo | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్ నగరంలోనూ భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో నెహ్రూ జూపార్కు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎండల నుంచి జంతువులకు ఉపశమనం కలిగించేందుకు జూపార్కులో ఏసీలు, కూలర్లు, స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్ ఏర్పాటు చేశారు.
Hyderabad Zoo | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్ నగరంలోనూ భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో నెహ్రూ జూపార్కు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎండల నుంచి జంతువులకు ఉపశమనం కలిగించేందుకు జూపార్కులో ఏసీలు, కూలర్లు, స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్ ఏర్పాటు చేశారు. దీంతో జంతువులకు అందించే ఆహార పదార్థాలను కూడా పూర్తిగా మార్చేశారు. ఎండ వేడిమి నుంచి జంతువులకు ఉపశమనం కలిగించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పులులు, సింహాలు, కోతులతో పాటు ఇతర జంతువులు ఉంటున్న ఎన్‌క్లోజర్ల వద్ద కూలర్లు ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రిపూట సంచరించే జంతువుల ఎన్‌క్లోజర్లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లతో పాటు ఎయిర్ కండిషనర్లను కూడా ఏర్పాటు చేశారు.

జంతువుల ఆహారపు అలవాట్లను కూడా పూర్తిగా మార్చేశారు. శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే ఆహారాన్ని అందిస్తున్నారు. నిమ్మజాతి పండ్లు, పుచ్చకాయ వంటి ఇతర ఆహార పదార్థాలను చేర్చారు. జంతువుల శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచడానికి గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్ పౌడర్ వాటర్‌ను అందిస్తున్నారు. విటమిన్ సి, బి-కాంప్లెక్స్ సప్లిమెంట్లను కూడా భోజనంలో చేర్చారు.

ప్రస్తుతం, హైదరాబాద్ జూలో 196 జాతుల జంతువులు, 2,100కు పైగా జీవులు ఉన్నాయి. వేసవి కాలంలో జంతు ప్రదర్శనశాలను పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శిస్తారని అంచనా వేస్తున్నందున, ఎక్కువ మంది సందర్శకులు గుమిగూడే వివిధ ప్రదేశాలలో తాటాకు షెడ్లను ఏర్పాటు చేశారు. వివిధ ప్రదేశాలలో తాగునీటి సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






