త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఓటీటీలోకి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ వివాదాస్ప‌ద మూవీ – క్షుద్ర‌పూజ‌ల కాన్సెప్ట్‌తో…

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ పోలీస్ కంప్లైంట్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాలో న‌వీన్ చంద్ర‌, రాగిణి ద్వివేది కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

N

Entertainment | Published On Jul 30, 2026, 6.40 pm IST

Telugu OTT | ఓటీటీలోకి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ వివాదాస్ప‌ద మూవీ – క్షుద్ర‌పూజ‌ల కాన్సెప్ట్‌తో…
Advertisement

Telugu OTT | న‌వీన్ చంద్ర‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు మూవీ పోలీస్ కంప్లైంట్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు సంజీవ్ మేగోటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మూఢ‌న‌మ్మ‌కాల‌కు ఛైన్ రియాక్ష‌న్ ఆఫ్ క‌ర్మ అనే కాన్సెప్ట్‌ను జోడించి పోలీస్ కంప్లైంట్ రూపొందింది.

అమెజాన్ ప్రైమ్‌లో...

ఈ తెలుగు మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు క‌న్న‌డంలో రిలీజ్ కాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. రాగిణి ద్వివేది, కృష్ణ‌సాయి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

వివాదంతో వార్త‌ల్లో...

పోలీస్ కంప్లైంట్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ పాల్గొన‌క‌పోవ‌డంపై మీడియా ముఖంగానే ద‌ర్శ‌కుడు విమ‌ర్శించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. రెమ్యూన‌రేష‌న్ తీసుకొని కూడా కావాల‌నే ప్ర‌మోష‌న్స్‌కు ఆమె దూరంగా ఉంద‌ని ఆరోపించాడు. ఈ వివాదంపై వ‌ర‌ల‌క్ష్మి రియాక్ట్ అయ్యింది. అవ‌స‌రం ఉన్న‌ప్పుడ‌ల్లా పోలీస్ కంప్లైంట్ టీమ్‌కు తాను అందుబాటులో ఉన్నాన‌ని, ద‌ర్శ‌కుడి ఆరోప‌ణ‌లు అబ‌ద్ద‌మంటూ వివ‌ర‌ణ ఇచ్చింది.

పోలీస్ ఇన్వేస్టిగేష‌న్‌...

మూఢ‌న‌మ్మ‌కాల పేరుతో ఓ గ‌ర్భిణిని కొంద‌రు హ‌త్య చేస్తారు. ఈ మ‌ర్డ‌ర్ కేసు పోలీసుల‌కు ఎలాంటి క్లూ దొర‌క్క‌పోవ‌డంతో అన్‌సాల్వ్‌డ్ కేసుగా మిగిలిపోతుంది. ఈకేసును ఓ లేడీ పోలీస్ ఆఫీస‌ర్ ఇన్వేస్టిగేష‌న్ చేయ‌డం మొద‌లుపెడుతుంది. ఈ ఇన్వేస్టిగేష‌న్‌లో ఈ హ‌త్య‌కు త‌న భ‌ర్త డాక్ట‌ర్ రామ్‌కు సంబంధం ఉంద‌ని క‌నిపెడుతుంది? భ‌ర్త నిజ‌స్వ‌రూపాన్ని ఆ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా బ‌య‌ట‌పెట్టింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

విల‌న్‌గా...డైరెక్ట‌ర్‌గా...

తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్ మూవీతో విల‌న్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌. ఆ త‌ర్వాత క్రాక్‌, వీర‌సింహారెడ్డి, య‌శోద‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించింది. ఇటీవ‌ల రిలీజైన తెలుగు మూవీ ఎస్ స‌ర‌స్వ‌తితో డైరెక్ట‌ర్‌గా మారింది. ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి లీడ్ రోల్‌లో న‌టించింది.

 

Advertisement
Advertisement