Priyanka Chopra | హాలీవుడ్ దిగ్గజాల సరసన ప్రియాంక చోప్రా – ఆస్కార్ అవార్డ్స్ ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆస్కార్ అవార్డ్స్ 2026 కు ప్రజెంటర్‌గా వ్యవహరించబోతుంది. రాబర్ట్ డౌనీ జూనియర్, అన్నే హాథ్‌వే వంటి దిగ్గజాలతో కలిసి ఈ వేడుకలో విజేతలకు ప్రియాంక అవార్డులను అందజేయబోతుంది.
Entertainment | Published On Mar 6, 2026, 4.29 pm IST
Priyanka Chopra | మహేష్‌బాబు వారణాసి మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది ప్రియాంక చోప్రా. మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 1500 కోట్లతో హాలీవుడ్ లెవెల్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం జోర్డాన్‌లో వారణాసి మూవీ షూటింగ్ జరుగుతోంది. నెక్స్ట్ షెడ్యూల్‌ను అంటార్కిటికాలో ప్లాన్ చేశారు. ఈ మంచు ఖండంలో షూటింగ్‌ను జరుపుకోనున్న ఫస్ట్ మూవీగా వారణాసి నిలవబోతుంది.
ఆస్కార్ వేడుకలో...
జోర్డాన్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ప్రియాంక ఇటీవలే అమెరికా వెళ్లింది. మార్చి 15న జరుగనున్న ఆస్కార్ వేడుకలో ఈ గ్లోబల్ స్టార్ మెరవబోతుంది. ఆస్కార్ అవార్డ్స్ 2026 ప్రజెంటర్స్ లిస్ట్‌ను అకాడమీ కమిటీ అనౌన్స్‌చేసింది. ఐరాన్ మ్యాన్ ఫేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్, గ్వినేత్ పాల్ట్రో, అన్నే హాథ్‌వే, పాల్ మెస్కల్ వంటి దిగ్గజాలతో కలిసి అవార్డ్స్ ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా వ్యవహరించబోతున్నది. ఈ గుడ్‌న్యూస్‌ను స్వయంగా ప్రియాంక చోప్రా అభిమానులతో పంచుకుంది. అవార్డ్ ప్రజెంటర్స్ లిస్ట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ ఏడాది ఇండియా నుంచి ఆస్కార్ వేడుకలో పాల్గొననున్న ఏకైక సెలిబ్రిటీగా ప్రియాంక నిలవనుంది.
రెండోసారి...
ప్రియాంక చోప్రా ఆస్కార్ ప్రజెంటర్‌గా వ్యవహరించడం ఇది రెండో సారి. గతంలో 2016లో 88వ ఆస్కార్ అవార్డ్స్‌లో ప్రియాంక పాల్గొన్నది. ఆ ఏడాది బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో విజేతకు ప్రియాంక అవార్డును అందజేసింది. మళ్లీ పదేళ్ల తర్వాత ఈ పురస్కారాల వేడుకలో ప్రియాంక కనిపించబోతుండటం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా పాల్గొన్నది. ఇప్పటివరకు ప్రియాంక చోప్రాతో పాటు దీపికా పదుకొనే మాత్రమే ఇండియా నుంచి ఆస్కార్ ప్రజెంటర్స్‌గా వ్యవహరించారు.ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక మార్చి 15న జరుగనుంది. ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు కోనన్ ఓబ్రియన్ హోస్ట్‌గా కనిపించబోతున్నారు.
సంబంధిత వార్తలు

Priyanka Chopra | పాకిస్థానీ దిగ్గజ నటి పాత్రలో ప్రియాంక చోప్రా.. ఫస్ట్ ఐటెమ్ గర్ల్‌గా గ్లోబల్ స్టార్
మే 14, 2026

Priyanka Chopra | దళపతి విజయ్ క్రేజ్ అప్పుడే తెలిసింది – డెబ్యూ మూవీ అనుభవాలపై ప్రియాంక చోప్రా కామెంట్స్
మే 11, 2026

Priyanka Chopra | హాలీవుడ్ సినిమాకు ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా…
మే 7, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



