త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kajal Aggarwal | లాయ‌ర్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ – మూడు భాష‌ల్లో ఇండియా స్టోరీ రిలీజ్‌

కాజ‌ల్ అగ‌ర్వాల్ నెక్స్ట్ మూవీ ఏద‌నే స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. ది ఇండియా స్టోరీ మూవీతో ఈ అందాల చంద‌మామ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. కోర్ట్‌రూమ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ సోమ‌వారం రివీలైంది.

N

Entertainment | Published On Apr 27, 2026, 4.41 pm IST

Kajal Aggarwal | లాయ‌ర్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ – మూడు భాష‌ల్లో ఇండియా స్టోరీ రిలీజ్‌
Advertisement

Kajal Aggarwal | కాజ‌ల్ అగ‌ర్వాల్ నుంచి కొత్త సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చి చాలా రోజులే అయ్యింది. గ‌త ఏడాది రిలీజైన స‌ల్మాన్ ఖాన్ సికంద‌ర్ డిజాస్ట‌ర్‌తో సినిమాల‌కు గ్యాప్ ఇచ్చింది ఈ అందాల చంద‌మామ‌. తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించి రెండేళ్లు దాటిపోయింది. కాజ‌ల్‌ నెక్స్ట్ మూవీ ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. సోమ‌వారం కొత్త మూవీ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది కాజ‌ల్‌. తెలుగులోనూ ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు వెల్ల‌డించింది.

ది ఇండియా స్టోరీ...

కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రేయ‌స్ త‌ల్ఫ‌డే ప్ర‌ధాన పాత్ర‌ల్లో ది ఇండియా స్టోరీ పేరుతో ఓ బాలీవుడ్ మూవీ తెర‌కెక్కుతోంది. కోర్ట్ రూమ్ క్రైమ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు చేత‌న్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సోమ‌వారం ది ఇండియా స్టోరీ రిలీజ్ డేట్‌ను సోష‌ల్ మీడియా ద్వారా కాజ‌ల్ అగ‌ర్వాల్ వెల్ల‌డించింది. జూలై 24న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ ఈ సినిమా విడుద‌ల కానుంద‌ని చెప్పింది.

బాంబే హైకోర్టు...

రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌లో కోర్టు బోనులో పురుగు మందు స్ప్రేయ‌ర్‌ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. ప‌చ్చ‌గా ఉన్న ఓ పంట పొలానికి కొంద‌రు పెస్టిసైడ్ స్ఫ్రే చేస్తుండ‌టం...వారి వెనుక బాంబే హైకోర్టు బిల్డింగ్ కూడా క‌నిపిస్తోన్నాయి. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

పెస్టిసైడ్ కంపెనీల స్కామ్ ....

పెస్టిసైడ్ కంపెనీల స్కామ్‌ల నేప‌థ్యంలో సాగ‌నున్న ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌బోతున్న‌ది. పెస్టిసైడ్ కంపెనీల వెనుక ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని చీక‌టి కోణాలు, వాటి వ‌ల్ల త‌లెత్తే అన‌ర్థాల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించ‌బోతున్నార‌ట‌.

కొత్త కోణంలో...

కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ‌గా గ్లామ‌ర్ రోల్స్ చేసిన‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ సినిమాలో ఛాలెంజింగ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ద‌ట‌. న‌టిగా ది ఇండియా స్టోరీ ఆమెను కొత్త కోణంలో ఆవిష్క‌రిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.
ప్ర‌స్తుతం కాజ‌ల్ అగ‌ర్వాల్ ది ఇండియా స్టోరీతో పాటు రామాయ‌ణ సినిమా చేస్తోంది. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీలో య‌శ్ కు జోడీగా మండోద‌రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

 

 

Advertisement
Advertisement