త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hansika | విడాకుల త‌ర్వాత టాలీవుడ్‌లోకి హ‌న్సిక రీఎంట్రీ – సినిమాతో కాదు…

విడాకుల త‌ర్వాత హ‌న్సిక టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. అయితే సినిమాతో కాదు...ఓ వెబ్‌సిరీస్ ద్వారా రెండేళ్ల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. గ‌ల్లీ పేరుతో తెర‌కెక్కిన ఈ వెబ్‌సిరీస్ త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.

N

Entertainment | Published On Mar 20, 2026, 3.48 pm IST

Hansika | విడాకుల త‌ర్వాత టాలీవుడ్‌లోకి హ‌న్సిక రీఎంట్రీ – సినిమాతో కాదు…
Advertisement

Hansika |  హీరోయిన్ హ‌న్సిక ఇటీవ‌లే విడాకుల‌తో వివాహ బంధానికి ముగింపు ప‌లికింది. బిజినెస్‌మెన్ సొహైల్ ఖ‌తురియాను ప్రేమించి పెళ్లిచేసుకున్న హ‌న్సిక మ‌న‌స్ప‌ర్థ‌ల నాలుగేళ్ల‌కే భ‌ర్త నుంచి విడిపోయింది. ఈ మ‌ధ్యే ఈ జంట‌కు కోర్టు విడాకుల‌ను మంజూరు చేసింది. వ్య‌క్తిగ‌త జీవితంలో ఒడిదుడుకులు, ప‌రాజ‌యాల కార‌ణంగా గ‌త రెండేళ్లుగా సినిమాల‌కు బ్రేక్ ఇచ్చింది హ‌న్సిక‌. విడాకుల స‌మ‌స్య ఓ కొలిక్కి రావ‌డంతో తిరిగి కెరీర్‌పై దృష్టి సారించింది. టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. అయితే సినిమాతో కాదు...ఓ వెబ్‌సిరీస్‌తో రెండేళ్ల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో...

అమెజాన్ ప్రైమ్ త‌న అప్‌క‌మింగ్ వెబ్‌సిరీస్‌, సినిమాల లిస్ట్‌ను గురువారం అనౌన్స్‌చేసింది. నాలుగు తెలుగు వెబ్‌సిరీస్‌ల‌ను ప్ర‌క‌టించింది. అందులో గ‌ల్లీ ఒక‌టి.
ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌లో సుధీర్‌బాబు, జేడీ చ‌క్ర‌వ‌ర్తి, హ‌న్సిక‌, శ్ర‌ద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆర్కా మీడియా బ్యాన‌ర్‌పై బాహుబ‌లి నిర్మాత‌లు శోభుయార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు.

రా అండ్ ర‌స్టిక్‌...

ఓల్డ్ సిటీ నేప‌థ్యంలో కంప్లీట్ రా అండ్ ర‌స్టిక్‌గా ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోంది. గ‌ల్లీ వెబ్‌సిరీస్‌కు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఓ గ‌ల్లీ క్రికెట్ మ్యాచ్ ఓల్డ్ సిటీలో ఎలాంటి గొడ‌వ‌ల‌కు దారి తీసింది? క్రికెట్ ప్లేయ‌ర్ల‌కు, క్రిమిన‌ల్స్‌కు మ‌ధ్య చిన్న‌గా మొద‌లైన గొడ‌వ పాత‌బ‌స్తీ మొత్తాన్ని ఎలా వ‌ణికించింద‌నే కాన్సెప్ట్‌తో ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోంది.

పాత‌బ‌స్తీ యువ‌తిగా...

గ‌ల్లీ వెబ్‌సిరీస్‌లో హ‌న్సిక పాత‌బ‌స్తీ యువ‌తిగా క‌నిపించ‌బోతుంది. జేడీ చ‌క్ర‌వ‌ర్తికి జోడీగా ఈ సిరీస్‌లో హ‌న్సిక న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. నెగెటివ్ ట‌చ్‌తో ఆమె క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని అంటున్నారు.
సుధీర్‌బాబుతో పాటు హ‌న్సిక న‌టిస్తున్న ఫ‌స్ట్ తెలుగు వెబ్‌సిరీస్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. గ‌ల్లీ వెబ్‌సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వ‌ర‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ స‌క్సెస్ సుధీర్‌బాబుతో పాటు హ‌న్సిక ఇద్ద‌రికి ఇంపార్టెంట్‌గా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement