Shell | మొన్న నయారా.. ఇప్పుడు షెల్.. ఇంధన ధరలు భారీగా పెంపు..
Shell | దేశంలో ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. తాజాగా షెల్ కంపెనీ తన రిటైల్ ఫ్యుయల్ ధరలను సవరించింది. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ మార్పులు షెల్ రిటైల్ సెల్లింగ్ ప్రైస్ (RSP) ఔట్‌లెట్లలో అమల్లో ఉంటాయి.
Shell | దేశంలో ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. తాజాగా షెల్ కంపెనీ తన రిటైల్ ఫ్యుయల్ ధరలను సవరించింది. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ మార్పులు షెల్ రిటైల్ సెల్లింగ్ ప్రైస్ (RSP) ఔట్‌లెట్లలో అమల్లో ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల అస్థిరతల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ధరల ప్రకారం పవర్ పెట్రోల్ ను లీటరుకు రూ.129.85గా నిర్ణయించగా, నార్మల్ పెట్రోల్ ధర రూ.119.85గా ఉంది. డీజిల్ విభాగంలో నార్మల్ డీజిల్ రూ.123.00కి, ప్రీమియం డీజిల్ రూ.133.00కి పెరిగింది.
డీజిల్ రూ.31, పెట్రోల్ రూ.15 పెంపు..
ఈ సవరణలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.15 పెరగ్గా, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరలు మరింతగా రూ.31.52 పెరిగాయి. ఇది ఇటీవలి కాలంలో గణనీయమైన పెరుగుదలగా చెప్పుకోవచ్చు. గత వారం నయారా ఎనర్జీ సంస్థ ధరలు పెంచగా ఇప్పుడు షెల్ కూడా అదే కోవలో ఇంధన ధరలను అమాంతం పెంచింది. నయారా ఎనర్జీ పెట్రోల్ ధరలను లీటర్‌కు రూ.5, డీజిల్ ధరలను రూ.3 చొప్పున పెంచింది. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కారణంగానే ఈ చర్యలు చోటు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి..
ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 50 శాతం వరకు పెరిగాయి. ఈ పరిస్థితి సరఫరా భయాలను పెంచి, ఆయిల్ మార్కెట్‌లో ధరలను మరింత పెరిగేలా చేసింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కొంతకాలంగా స్థిరంగా ఉండటం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. అంతర్జాతీయ ధరలు పెరిగినా దేశీయ ధరలు మారకపోవడం వల్ల మార్జిన్లు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ధరల పెంపు తప్పనిసరి అయిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా గ్లోబల్ క్రూడ్ ధరల పెరుగుదల ప్రభావం ఇప్పుడు దేశీయ ఇంధన ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వినియోగదారుల ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






