త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rupee Falls | చారిత్ర‌క క‌నిష్ఠానికి రూపాయి విలువ‌.. 

Rupee Falls | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌పంచ వ్యాప్తంగా అనిత్చి కొన‌సాగుతుండ‌టంతో రూపాయి మార‌క‌పు విలువ (Rupee Falls) మ‌రింత దిగ‌జారి చారిత్రక కనిష్ఠ స్థాయికి చేరుకున్న‌ది.

G

Business | Published On Mar 27, 2026, 9.48 am IST

Rupee Falls | చారిత్ర‌క క‌నిష్ఠానికి రూపాయి విలువ‌.. 
Advertisement

Rupee Falls | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌పంచ వ్యాప్తంగా అనిత్చి కొన‌సాగుతుండ‌టంతో రూపాయి మార‌క‌పు విలువ (Rupee Falls) మ‌రింత దిగ‌జారి చారిత్రక కనిష్ఠ స్థాయికి చేరుకున్న‌ది. డాలర్‌తో పోలిస్తే మరో 20 పైసలు కోల్పోయి 94.15కు చేరింది. ప్ర‌స్తుతం రూ.94.27 వ‌ద్ద కొన‌సాగుతున్న‌ది. బుధ‌వారం రూపాయి విలువ 93.97 వ‌ద్ద ముగిసిన విష‌యం తెలిసిందే.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో రూపాయి ప‌త‌నానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఈక్వినామిక్ రీసెర్చ్ ఎండీ జీ చొక్క‌లింగం తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి రూపాయి విలువ 3.6 శాతం మేర క్షీణించింద‌ని చెప్పారు. అయితే యుద్ధం ముగిసిన త‌ర్వాత డాల‌ర్‌తో పోల్చితే రూపాయి విలువ రూ.90కు చేరుకుంటుంద‌ని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement