త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nalgonda Mayor | న‌ల్ల‌గొండ మేయ‌ర్‌గా బుర్రి చైత‌న్య రెడ్డి.. తొలి మ‌హిళ‌గా రికార్డ్‌

Nalgonda Mayor | న‌ల్ల‌గొండ కార్పొరేషన్‌ తొలి మహిళా మేయర్‌గా (Nalgonda Mayor) బుర్రి చైతన్య రెడ్డి (Burri Chaitanya Reddy) ఎన్నిక‌య్యారు. 32వ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌గా విజ‌యం సాధించిన ఆమెను మేయ‌ర్ స్థానానికి ఇప్ప‌టికే మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఖ‌రారు చేశారు.

G

Telangana | Published On Feb 16, 2026, 12.42 pm IST

Nalgonda Mayor | న‌ల్ల‌గొండ మేయ‌ర్‌గా బుర్రి చైత‌న్య రెడ్డి.. తొలి మ‌హిళ‌గా రికార్డ్‌
Advertisement

Nalgonda Mayor | త్రినేత్ర‌.న్యూస్‌: న‌ల్ల‌గొండ కార్పొరేషన్‌ తొలి మహిళా మేయర్‌గా (Nalgonda Mayor) బుర్రి చైతన్య రెడ్డి (Burri Chaitanya Reddy) ఎన్నిక‌య్యారు. 32వ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌గా విజ‌యం సాధించిన ఆమెను మేయ‌ర్ స్థానానికి ఇప్ప‌టికే మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఖ‌రారు చేశారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ప్ర‌మాణం చేసిన కౌన్సిల‌ర్లు చైత‌న్య రెడ్డి మేయ‌ర్‌గా ఎన్నుకున్నారు. గ‌తంలో ఆమె కౌన్సిల‌ర్‌గా, న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణంలోని రామాల‌యం చైర్మ‌న్‌గా సేవ‌లందించారు. ఆమె భ‌ర్త బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్‌. ఆమె త‌ల్లి స‌ర్పంచ్‌గా చేశారు.

నల్ల‌గొండ నగరపాలికలో మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి.ఇందులో కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఎంఐఎం 2, ఐఎఫ్‌బీ 4, స్వతంత్రులు 2 చొప్పున‌ విజయం సాధించారు. కాగా, కార్పొరేష‌న్‌లో 1953 నుంచి 2020 వరకు 14 సార్లు ఎన్నికలయ్యాయి. ఇందులో 9 సార్లు కాంగ్రెస్, రెండుసార్లు బీజేపీ, టీడీపీ, ఒక ప‌ర్యాయం బీఆర్ఎస్ చైర్మన్‌ పీఠాన్ని ద‌క్కించుకున్నాయి. అప్పట్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట నరసింహారావు తొలి చైర్మన్‌గా గెలిచారు. 2020-24 వరకు మందడి సైదిరెడ్డి (బీఆర్ఎస్‌) ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. దీంతో 2024-25 వరకు బుర్రి శ్రీనివాస్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం అతని సతీమణి 32వ డివిజన్‌ కార్పొరేటర్‌గా చైతన్యరెడ్డి గెలవడంతో ఆమె తొలి మహిళా మేయర్‌గా ఎన్నిక‌య్యారు.

Advertisement

తాజావార్తలు

Advertisement