త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MGNREGA | ఉపాధి హామీ ప‌థ‌కానికి కేంద్రం తిలోద‌కాలు

MGNREGA | జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని (MGNREGA) ర‌ద్దు చేసేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును ప్ర‌స్తుత శీతాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే ప్ర‌వేశ‌పెట్టేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది.

A

News | Published On Dec 15, 2025, 1.23 pm IST

MGNREGA | ఉపాధి హామీ ప‌థ‌కానికి కేంద్రం తిలోద‌కాలు
Advertisement

MGNREGA | గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు జీవ‌నానికి వెన్నుద‌న్నుగా నిలుస్తున్న జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని (MGNREGA) ర‌ద్దు చేసేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును ప్ర‌స్తుత శీతాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే ప్ర‌వేశ‌పెట్టేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ బిల్లు ముసాయిదా ప్ర‌తుల‌ను లోక్‌స‌భ స‌భ్యుల‌కు సోమ‌వారం అంద‌జేశారు. ఉపాధి హామీ ప‌థ‌కానికి ప్ర‌త్యామ్నాయంగా మ‌రో ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇటీవ‌లే పేరు మార్పు...

ఇటీవ‌లే మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం పేరును కేంద్ర‌ప్ర‌భుత్వం మార్చింది. దానిని పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజ‌న‌గా నామ‌క‌ర‌ణం చేయ‌డంతో పాటు కొన్ని కీల‌క స‌వ‌ర‌ణ‌లు చేసింది. క‌నీస ప‌నిదినాల సంఖ్య‌ను 100 నుంచి 125కు పెంచింది. దీంతో పాటు క‌నీస వేత‌నాన్ని రూ.240కి స‌వ‌రించింది. ప‌థ‌కాన్ని ర‌ద్దు చేసే యోచ‌న ఉన్న‌ప్పుడు దాని పేరు మార్పు చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌నే విమ‌ర్శ‌లు సైతం వినిపిస్తున్నాయి.

2005 నుంచి అమ‌లులో...

గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు క‌నీస ఉపాధి క‌ల్పించడంతో పాటు అభివృద్ధి ప‌నులు చేసేందుకు 2005లో అప్ప‌టి యూపీఏ ప్ర‌భుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంగా దీనిని ప్ర‌వేశ‌పెట్టంది. అనంతరం 2009లో ఈ ప‌థ‌కాన్ని మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంగా పేరు మార్చారు. ఇటీవ‌లే తిరిగి దాని పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజ‌న‌గా మార్చారు.

త్వ‌ర‌లో కొత్త ప‌థ‌కం...

ఇప్పుడు ఉన్న ప‌థ‌కాన్ని ర‌ద్దు చేసి దాని స్థానంలో నూత‌న ప‌థ‌కాన్ని కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. విక‌సిత్ భార‌త్ 2047 ల‌క్ష్యాల‌కు అనుగుణంగా గ్రామీణాభివృద్ధి సాధించే ల‌క్ష్యంగా ఈ ప‌థ‌కాన్ని రూపొందిస్తున్నారు. విక‌సిత్ భార‌త్ - గ్యారెంటీ ఫ‌ర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిష‌న్ (గ్రామీణ్‌) బిల్లును ఈ ఏడాదే పార్ల‌మెంట్‌లో ఆమోదించి, అమ‌లులోకి తీసుకురానున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజావార్తలు

Advertisement