Keralam | కేరళ కాదు కేరళం..? పేరు మార్పుపై నేడు కీలక నిర్ణయం
Keralam | కేరళ (Kerala) రాష్ట్రం పేరు మార్పు మరోమారు తెరపైకి వచ్చింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేరళ పేరును ‘కేరళం’గా (Keralam) మార్చే బిల్లును ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Keralam | కేరళ (Kerala) రాష్ట్రం పేరు మార్పు మరోమారు తెరపైకి వచ్చింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేరళ పేరును ‘కేరళం’గా (Keralam) మార్చే ప్రతిపాదనకు ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కేరళను కేరళంగా (Kerala To Be Renamed Keralam) మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే రెండుసార్లు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేరళ రాష్ట్ర పేరును కేరళం(Keralam)గా మార్చాలని కోరుతూ 2023లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే, ఆ తీర్మానంపై కేంద్రం కొన్ని సాంకేతికపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో 2024 జూన్‌లో మరోసారి రాష్ట్ర పేరును కేరళంగా మార్చే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలతో పాటు అందరూ ఏకపక్షంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. 8వ షెడ్యూల్‌లోని భాషలు సహా అన్ని భాషల్లోనూ ‘కేరళం’గా పేరు మార్చడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం గతకొన్ని రోజులుగా కేంద్రాన్ని కోరుతోంది.
‘మలయాళంలో రాష్ట్రం పేరును ‘కేరళం’ అని పిలిచేవారు. కానీ, ఇతర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటం కాలం నుంచి మలయాళం మాట్లాడే వర్గాల కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ లో రాష్ట్రం పేరును కేరళ అని రాసి ఉంది. దీంతో దాన్ని కేరళంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పేరును కేరళంగా మార్చే ప్రతిపాదనకు ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






