త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ISRO | ఇస్రోలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 9

ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కింద పనిచేసే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఉద్యోగ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. వివిధ విభాగాల్లో 97 ఖాళీల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది.

S

National | Published On Oct 21, 2026, 2.20 pm IST

ISRO | ఇస్రోలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 9
Advertisement

ISRO | త్రినేత్ర న్యూస్ : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కింద పనిచేసే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఉద్యోగ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. వివిధ విభాగాల్లో 97 ఖాళీల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. ఈ భర్తీలో టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్ర‌రీ అసిస్టెంట్, నర్స్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్, ఫైర్‌మన్, లైట్ & హెవీ వెహికల్ డ్రైవర్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబ‌ర్ 19 నుంచి న‌వంబ‌ర్ 9వ తేదీ రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నాయి. ద‌ర‌ఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్ apps.shar.gov.in ను సంప్ర‌దించొచ్చు.

చాలా పోస్టులకు వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంది. ఫైర్‌మన్, ఎంటీఎస్ పోస్టులకు 18-25 సంవత్సరాలు వర్తిస్తాయి. విద్యార్హ‌త‌లు, త‌దిత‌ర వివ‌రాల కోసం వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

Advertisement
Advertisement