త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran | వెంట‌నే ఇరాన్‌ను వీడండి.. పౌరుల‌కు భార‌త్ కీల‌క అడ్వైజ‌రీ

Iran | ఇరాన్‌లోని పౌరుల‌కు (Indian Citizens) భార‌త్ తాజాగా కీల‌క అడ్వైజ‌రీ జారీ చేసింది. వెంట‌నే టెహ్రాన్‌ను వీడాల‌ని హెచ్చ‌రించింది. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారులు, ప‌ర్యాట‌కులు అందుబాటులో ఉన్న ర‌వాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను విడిచిపెట్టాల‌ని సూచించింది.

D

National | Published On Feb 23, 2026, 2.36 pm IST

Iran | వెంట‌నే ఇరాన్‌ను వీడండి.. పౌరుల‌కు భార‌త్ కీల‌క అడ్వైజ‌రీ
Advertisement

Iran | మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ (Iran)పై ఏ క్షణమైనా అమెరికా దాడి (Tehran-US Tensions) చేసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే అమెరికా తన అమ్ములపొదిలోని శక్తివంతమైన ఆయుధాలను రంగంలోకి దించింది. ఏ క్ష‌ణ‌మైనా యుద్ధం వ‌చ్చే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ వార్త‌ల వేళ ఇరాన్‌లోని పౌరుల‌కు (Indian Citizens) భార‌త్ తాజాగా కీల‌క అడ్వైజ‌రీ జారీ చేసింది. వెంట‌నే టెహ్రాన్‌ను వీడాల‌ని హెచ్చ‌రించింది. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారులు, ప‌ర్యాట‌కులు అందుబాటులో ఉన్న ర‌వాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను విడిచిపెట్టాల‌ని సూచించింది.

ఈ మేర‌కు జనవరి 5న జారీ చేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మళ్లీ అడ్వైజరీ జారీ చేసింది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భార‌త పౌరులు, భార‌త సంత‌తికి చెందిన వ్య‌క్తులు త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించింది. ఆందోళ‌న‌లు జ‌రిగే ప్రాంతాల‌కు దూరంగా ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. తాజా ప‌రిణామాల కోసం స్థానిక మీడియాను అనుస‌రించాల‌ని సూచించింది. అంతేకాదు, ఇరాన్‌లోని భార‌త పౌరులు పాస్‌పోర్టులు, ఐడీ కార్డులు, ఇమ్మిగ్రేష‌న్ ప‌త్రాలు త‌మ వ‌ద్ద అందుబాటులో ఉంచుకోవాల‌ని సూచించింది. ఏదైనా సహాయం కోసం వెంట‌నే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని స్ప‌ష్టం చేసింది.

https://x.com/PTI_News/status/2025843403658035508

ట్రంప్ 10 రోజుల డెడ్ లైన్

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌కు ఒక కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. అణు ఒప్పందంపై 10 నుంచి 15 రోజుల్లోగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే "తీవ్ర పరిణామాలు" ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ గడువు ముగుస్తున్న తరుణంలోనే ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే డజన్ల కొద్దీ అమెరికన్ KC-135, KC-46 స్ట్రాటో ట్యాంకర్లు అట్లాంటిక్ మీదుగా మిడిల్ ఈస్ట్‌కి చేరుకుంటున్నాయి. జోర్డాన్, ఖతార్, కువైట్, యూఏఈలోని అమెరికా స్థావరాలకు ఈ విమానాలు భారీగా తరలివస్తున్నాయి.

Advertisement
Advertisement