El Nino India 2026 | జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారత్‌కు పొంచి ఉన్న ‘ఎల్ నినో’ ముప్పు.. ఈసారి వానలు కరువే!
రైతులు, ప్రజలకు ఐఎండీ కీలక హెచ్చరిక. ఈ వర్షాకాలంలో భారత్‌పై ఎల్ నినో (El Nino) ప్రభావం తీవ్రంగా ఉంటుందని, మూడేళ్లలో అత్యల్ప వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది.
- ఈ ఏడాది వర్షాకాలాన్ని ఎల్ నినో తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న భారత వాతావరణ శాఖ (IMD)
- గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి దేశవ్యాప్తంగా అత్యల్ప వర్షపాతం నమోదవుతుందని వార్నింగ్
- జూన్‌లో మొదలై సెప్టెంబర్ నాటికి ఎల్ నినో ప్రభావం పూర్తి స్థాయికి చేరుకుంటుందని అంచనా
- దీనివల్ల భారత్‌లో వడగాల్పులు పెరగడంతో పాటు వ్యవసాయం, నీటి వనరులపై తీవ్ర ఒత్తిడి పడే ఛాన్స్
El Nino India 2026 | త్రినేత్ర.న్యూస్ : రైతులు, సాధారణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) ఒక ఆందోళనకరమైన అప్‌డేట్ (Grim update) అందించింది. ఈ ఏడాది వర్షాకాలంలో (Monsoon season) భారతదేశంపై 'ఎల్ నినో' (El Nino) ప్రభావం గట్టిగా పడనుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని కారణంగా గడిచిన మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
దేశంలో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారికంగా ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.
ఎల్ నినో ఎప్పుడు మొదలవుతుంది?
జూన్ నెలలో బలహీనంగా ప్రారంభమయ్యే ఎల్ నినో ప్రభావం.. క్రమంగా పుంజుకుని జూలై మధ్య నాటికి, ఆగస్టులో మోస్తరు (Moderate) స్థాయికి చేరుకుంటుందని మహాపాత్ర వివరించారు. ఇక సెప్టెంబర్ నెల వచ్చేసరికి ఇది తన పూర్తి ఉగ్రరూపాన్ని (Full strength) చూపుతుందని అంచనా వేశారు. పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్నే ఎల్ నినో అంటారు. దీనివల్ల ఆసియా వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు వస్తాయి.

నాసా, అంతర్జాతీయ సంస్థల వార్నింగ్
కేవలం ఐఎండీ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.
ఆస్ట్రేలియాకు చెందిన బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ (BOM) జూన్‌లోనే ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా వేసింది.
చైనా వాతావరణ కేంద్రం కూడా పసిఫిక్ మహాసముద్రం ఇప్పటికే ఎల్ నినో దశలోకి ప్రవేశించిందని, రాబోయే నెలల్లో ఇది మరింత బలపడుతుందని రిపోర్ట్ చేసింది.
నాసా (NASA) శాటిలైట్ చిత్రాల ప్రకారం.. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం కింద వేడి నీరు భారీగా పేరుకుపోతోంది. ఇది క్రమంగా పైకి వచ్చి తూర్పు పసిఫిక్ అంతటా విస్తరించడం ఎల్ నినో ఏర్పడటానికి స్పష్టమైన సంకేతమని (Signal) శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భారత్‌పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది?
చరిత్రాత్మకంగా చూస్తే.. ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ భారతదేశంలో వర్షాలు ముఖం చాటేస్తాయి. ఈసారి కూడా వర్షపాతం సగటు కంటే తక్కువే ఉంటుందని స్పష్టమవుతోంది. దీనివల్ల దేశంలో వడగాల్పులు (Heatwaves) మరింత పెరిగే ప్రమాదం ఉంది. సగానికి పైగా వర్షాధారిత వ్యవసాయం (Agriculture) ఉన్న మన దేశంలో పంటలపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా, తాగునీరు, రిజర్వాయర్లలో నీటి వనరులకు భారీ కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాలన్నీ ఎల్ నినో రాకను కన్ఫర్మ్ చేస్తుండటంతో.. రాబోయే వర్షాకాలం దేశ ఆర్థిక వ్యవస్థపై, రైతాంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
An El Niño will likely arrive later in the year, according to sea level data from Sentinel-6 Michael Freilich. The satellite—which measures the height of the entire ocean every 10 days—captured a swell of warm water hundreds of miles wide in the Pacific Ocean off the coast of… pic.twitter.com/8olthcBjEJ
— NASA Earth (@NASAEarth) May 27, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mumbai Dabbawalas | 135 ఏళ్ల చరిత్రకు ఎండ్‌కార్డ్! ముంబై 'డబ్బావాలా'లను దెబ్బతీసిన వర్క్ ఫ్రమ్ హోమ్, ఫుడ్ యాప్స్
- ●Richest Heroine | సౌత్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరంటే?
- ●Congress MLA Anirudh Reddy | "నాలుక జాగ్రత్త పవన్.. కావాలంటే గుజరాత్లో పార్టీ పెట్టుకో!" పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
- ●Machiavellian Politics Telangana | ఆంధ్రా నాయకుల 'మెకియవెల్లీ' గేమ్.. రేవంత్ సర్కార్ సపోర్ట్! తెలంగాణ చైతన్యాన్ని టార్గెట్ చేస్తున్న 'బిగ్ ఫిష్' ఎవరు?
- ●Uttam Kumar Reddy | పాలమూరులో నీటిపారుదలపై సీఎం రేవంత్ ఫోకస్.. రెండు రోజుల పర్యటనలో ప్రాజెక్టుల తనిఖీ..!
- ●Buchi Babu Sana | పెద్ది ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదు...చిరంజీవి తిడతారనుకున్నా - పెద్దిపై బుచ్చిబాబు సానా కామెంట్స్

Mumbai Dabbawalas | 135 ఏళ్ల చరిత్రకు ఎండ్‌కార్డ్! ముంబై 'డబ్బావాలా'లను దెబ్బతీసిన వర్క్ ఫ్రమ్ హోమ్, ఫుడ్ యాప్స్

Richest Heroine | సౌత్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరంటే?

Congress MLA Anirudh Reddy | "నాలుక జాగ్రత్త పవన్.. కావాలంటే గుజరాత్లో పార్టీ పెట్టుకో!" పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

Machiavellian Politics Telangana | ఆంధ్రా నాయకుల 'మెకియవెల్లీ' గేమ్.. రేవంత్ సర్కార్ సపోర్ట్! తెలంగాణ చైతన్యాన్ని టార్గెట్ చేస్తున్న 'బిగ్ ఫిష్' ఎవరు?




