త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Swiggy Instamart | ఏడాదికి కండోమ్‌ల‌కు రూ.ల‌క్ష‌కు పైగా ఖ‌ర్చు చేసిన యువ‌కుడు

Swiggy Instamart | చెన్నై (Chennai)కి చెందిన ఒక వ్య‌క్తి 2025లో స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ (Swiggy Instamart) ద్వారా కేవ‌లం కండోమ్‌ (Condoms) లు కొనుగోలు చేసేందుకే ల‌క్ష రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేశారు. తాజాగా స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ విడుద‌ల చేసిన త‌న ఇయ‌ర్ ఎండ్ ఆర్డ‌ర్ (Year End Order) విశ్లేష‌ణ ద్వారా ఇది బ‌హిర్గ‌త‌మైంది.

A

National | Published On Dec 25, 2025, 6.18 pm IST

Swiggy Instamart | ఏడాదికి కండోమ్‌ల‌కు రూ.ల‌క్ష‌కు పైగా ఖ‌ర్చు చేసిన యువ‌కుడు
Advertisement

Swiggy Instamart | చెన్నై (Chennai)కి చెందిన ఒక వ్య‌క్తి 2025లో స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ (Swiggy Instamart) ద్వారా కేవ‌లం కండోమ్‌ (Condoms) లు కొనుగోలు చేసేందుకే అక్ష‌రాలా ల‌క్ష రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేశారు. తాజాగా స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ విడుద‌ల చేసిన త‌న ఇయ‌ర్ ఎండ్ ఆర్డ‌ర్ (Year End Order) విశ్లేష‌ణ ద్వారా ఇది బ‌హిర్గ‌త‌మైంది. త‌మ నివేదిక‌లో అత్యంత అసాధార‌ణ‌మైన ఖ‌ర్చుకు సంబంధించిన అంశాల‌లో ఇది ఒక‌టి స్విగ్గీ అభివ‌ర్ణించింది. భార‌తీయులు ఈ ఏడాదిలో త‌మ యాప్‌ను ఎలా వినియోగించుకున్నార‌నే అంశాల‌ను ఈ నివేదిక‌లో పొందుప‌రిచింది. స‌దరు వ్య‌క్తి 228 ఆర్డ‌ర్ల ద్వారా కండోమ్‌ల‌ను ఆర్డ‌ర్ చేసి, రూ.1,06,398 ఖ‌ర్చు చేశాడు. ఈ క‌థ‌నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారింది.

ఎక్కువ‌గానే కండోమ్‌ల కొనుగోలు

త‌మ యాప్ ద్వారా జ‌రిగే ప్ర‌తి 127 ఆర్డ‌ర్ల‌లో ఒక కండోమ్ ప్యాకెట్ ఉంటుంద‌ని తెలిపింది. ఈ ఏడాదిలో అత్య‌ధికంగా సెప్టెంబ‌ర్ నెల‌లో కండోమ్‌ల కొనుగోలు అధికంగా ఉన్న‌ట్లు వివ‌రించింది. అక్టోబ‌ర్ మాసంతో పోలిస్తే న‌వంబ‌ర్‌లో కండోమ్ ఆర్డ‌ర్‌లు 24 శాతం పెరిగాయని పేర్కొంది.

ఒకే ఆర్డ‌ర్‌లో మూడు ఐఫోన్‌లు

బెంగుళూరుకు చెందిన ఒక వినియోగ‌దారుడు ఇన్‌స్టా మార్ట్ ఆర్డ‌ర్ల ద్వారా ఒకేసారి ఎక్క‌వ ఖ‌ర్చు చేసిన వ్య‌క్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అత‌డు మూడు ఐఫోన్‌ల‌ను ఒకే ఆర్డ‌ర్‌లో రూ.4.3 ల‌క్ష‌లు వెచ్చించి కొనుగోలు చేశాడు. నోయిడాకు చెందిన మ‌రో యువ‌కుడు ఒకే ఆర్డ‌ర్‌లో రూ.2.69 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి, ఇంట్లోకి అవ‌స‌ర‌మైన బ్లూటూత్ స్పీక‌ర్లు, ఎస్ఎస్‌డీలు, రోబోటిక్ వాక్యూమ్ క్లీన‌ర్‌లు కొనుగోలు చేశాడు.

రెడ్‌బుల్‌కే రూ.16 ల‌క్ష‌ల‌కు పైగా చెల్లింపు

ముంబైకి చెందిన ఒక వ్య‌క్తి త‌న అకౌంట్ నుంచి ఏడాది మొత్తం క‌లిపి షుగ‌ర్ ఫ్రీ రెడ్‌బుల్ కోసం రూ.16.3 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాడు. చెన్నైకి చెందిన ఒక జంతు ప్రేమికుడు పెంపుడు జంతువుల ఫుడ్ కోసం ఏకంగా రూ.2.41 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లు స్విగ్గీ తెలిపింది.

 

 

Advertisement
Advertisement