త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Bangladesh Trade Deal | అమెరికా-బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్‌.. సుంకాలు 20 నుంచి 19 శాతానికి త‌గ్గింపు..

US-Bangladesh Trade Deal | భార‌త్‌పై విధించిన సుంకాల‌ను అమెరికా 25 నుంచి 18 శాతానికి త‌గ్గించిన నేప‌థ్యంలో బంగ్లాదేశ్ సైతం అగ్ర రాజ్యంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. ఈ మేర‌కు అమెరికా, బంగ్లాదేశ్ ల మ‌ధ్య కీల‌క వాణిజ్య ఒప్పందం కుదిరింద‌ని ఇరు దేశాలు ఒక‌ సంయుక్త ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి.

S

International | Published On Feb 10, 2026, 8.06 am IST

US-Bangladesh Trade Deal | అమెరికా-బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్‌.. సుంకాలు 20 నుంచి 19 శాతానికి త‌గ్గింపు..
Advertisement

US-Bangladesh Trade Deal | భార‌త్‌పై విధించిన సుంకాల‌ను అమెరికా 25 నుంచి 18 శాతానికి త‌గ్గించిన నేప‌థ్యంలో బంగ్లాదేశ్ సైతం అగ్ర రాజ్యంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. ఈ మేర‌కు అమెరికా, బంగ్లాదేశ్ ల మ‌ధ్య కీల‌క వాణిజ్య ఒప్పందం కుదిరింద‌ని ఇరు దేశాలు ఒక‌ సంయుక్త ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి. ఈ డీల్‌లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు ఎగుమ‌తి అయ్యే అనేక వ‌స్తువుల‌పై టారిఫ్‌ల‌ను త‌గ్గించారు. అలాగే ప‌లు ర‌కాల వ‌స్త్రాలు, దుస్తుల‌కు డ్యూటీ మిన‌హాయింపుల‌ను క‌ల్పించేందుకు కూడా అమెరికా అంగీక‌రించిన‌ట్లు తెలిపారు. ఇరు దేశాల మ‌ధ్య కుదిరిన ట్రేడ్ డీల్ ప్ర‌కారం బంగ్లాదేశ్ పై ఇప్ప‌టి వ‌ర‌కు విధిస్తున్న రెసిప్రొక‌ల్ టారిఫ్‌ను 20 నుంచి 19 శాతానికి త‌గ్గించిన‌ట్లు అమెరికా వెల్ల‌డించింది.

అప్పట్లో 37.. ఇప్పుడు 19..

ట్రేడ్ వార్ నేపథ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గ‌తంలో బంగ్లాదేశ్ ఉత్పత్తుల‌పై 37 శాతం టారిఫ్‌ల‌ను విధించారు. అయితే గతేడాది ఆగ‌స్టులో టారిఫ్‌ను 20 శాతానికి త‌గ్గించారు. ఈ క్ర‌మంలో తాజాగా కుదిరిన ట్రేడ్ డీల్ అనంత‌రం ఆ టారిఫ్ మ‌రికాస్త త‌గ్గింది. ఇక బంగ్లాదేశ్ అమెరికాకు ఎగుమ‌తి చేస్తున్న ఉత్ప‌త్తుల్లో 80 శాతం వ‌ర‌కు వ‌స్త్రాలు, గార్మెంట్స్ రంగానికి చెందిన‌వే కావ‌డం విశేషం. 2024లో జ‌రిగిన విద్యార్థుల ఉద్య‌మం అనంత‌రం బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ప్ర‌భుత్వ మార్పు కార‌ణంగా ఆ రంగంపై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుత వాణిజ్య ఒప్పందం ఆ రంగానికి ఊర‌ట‌నిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

గార్మెంట్ ఉత్ప‌త్తుల‌పై జీరో టారిఫ్..?

కాగా ఈ ఒప్పందం ప్ర‌కారం అమెరికా నుంచి బంగ్లాదేశ్‌కు ఎగుమ‌తి అయ్యే ప‌త్తి, మానవ నిర్మిత ఫైబ‌ర్ వంటి ముడి స‌రుకుల ప‌రిమాణానికి అనుగుణంగా కొన్ని ర‌కాల బంగ్లాదేశ్ వ‌స్త్రాలు, దుస్తుల‌పై జీరో టారిఫ్ ల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో ఇరు దేశాల‌కు కూడా మేలు జ‌రుగుతుంద‌ని తెలిపారు. అయితే కేవ‌లం వ‌స్త్రాలు, గార్మెంట్స్ రంగానికి చెందిన ఉత్ప‌త్తుల‌పైనే కాకుండా భ‌విష్య‌త్తులో ఇత‌ర ఉత్ప‌త్తుల‌పై కూడా జీరో టారిఫ్‌ల‌ను వ‌ర్తింప‌జేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు అమెరికా తెలిపింది. ఈ మేర‌కు ఇరు దేశాలు ఒప్పందంలో ఈ విష‌యాన్ని పేర్కొన్నాయి. ట్రేడ్ డీల్ ప్ర‌కారం ఇరు దేశాలు అధికారికంగా ఉత్తర్వుల‌ను జారీ చేయాల్సి ఉంద‌ని, ఆ త‌రువాత వెంట‌నే త‌గ్గించిన టారిఫ్‌లు అమ‌లులోకి వ‌స్తాయ‌ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌భుత్వ అధినేత మ‌హ‌మ్మ‌ద్ యూనుస్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

ఈ సందర్భంగా బంగ్లాదేశ్ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు ఖ‌లీలుర్ ర‌హ‌మాన్ మాట్లాడుతూ అమెరికా నుంచి పంపే ముడిస‌రుకుల‌ను వినియోగించి ఉత్ప‌త్తి చేసే వ‌స్త్రాలు, ఇత‌ర దుస్తుల‌కు డ్యూటీ మిన‌హాయింపుల‌ను ఇస్తే బంగ్లాదేశ్ గార్మెంట్స్ రంగానికి గ‌ణ‌నీయ‌మైన ఊతం ల‌భిస్తుంద‌ని అన్నారు. ఇక 2024లో బంగ్లాదేశ్ అమెరికాకు సుమారుగా 8.4 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన వ‌స్తువుల‌ను ఎగుమ‌తి చేయ‌గా, అదే స‌మ‌యంలో బంగ్లాదేశ్ అమెరికా నుంచి 2.2 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఉత్ప‌త్తుల‌ను దిగుమ‌తి చేసుకుంది.

Advertisement
Advertisement