త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India-US trade deal | అమెరికా-భార‌త్ ట్రేడ్ డీల్‌.. ఇండియాపై పాక్‌లో ప్ర‌శంస‌లు

India-US trade deal | భార‌త్‌-అమెరికా మ‌ధ్య కుదిరిన కీల‌క ట్రేడ్ డీల్ (India-US trade deal)పై సర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ డీల్ ముఖ్యంగా దాయాది పాకిస్థాన్ (Pakistan)లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.

D

International | Published On Feb 5, 2026, 10.21 am IST

India-US trade deal | అమెరికా-భార‌త్ ట్రేడ్ డీల్‌.. ఇండియాపై పాక్‌లో ప్ర‌శంస‌లు
Advertisement

India-US trade deal | భార‌త్‌-అమెరికా మ‌ధ్య కుదిరిన కీల‌క ట్రేడ్ డీల్ (India-US trade deal)పై సర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ డీల్ ముఖ్యంగా దాయాది పాకిస్థాన్ (Pakistan)లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. సుంకాల దెబ్బ‌కు భార‌త్‌-అమెరికా మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల స‌మ‌యంలో అమెరికాతో సంబంధాలు బ‌లోపేతం చేసుకునేందుకు దాయాది తీవ్రంగా ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. ట్రంప్ (Donald Trump)ను నోబెల్ శాంతి బ‌హుమ‌తికి (Nobel Peace Prize) కూడా నామినేట్ చేసింది.

ట్రంప్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసేందుకు పాక్ అధికారులు మీడియా స‌మావేశాల్లో భార‌త్‌, ప్ర‌ధాని మోదీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్ మార్ష‌ల్ వ‌రుస‌గా యూఎస్‌లో ప‌ర్య‌టించి ట్రంప్‌, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశాలు నెరిపారు. భార‌త్‌-పాక్ మ‌ధ్య యుద్ధం ఆపింది ట్రంపేన‌ని క్రెడిట్ కూడా ఇచ్చారు. అయితే, సుంకాలు త‌గ్గించుకునే విష‌యంలో మాత్రం పాక్ ప్ర‌ధాని ష‌రీఫ్ పురోగ‌తి సాధించ‌లేక‌పోయారు.

పాక్ ప్ర‌భుత్వంపై ట్రోల్స్‌..

దీంతో ఆ దేశ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై ఫైర్ అవుతున్నారు. వాషింగ్ట‌న్‌తో నెల‌ల తర‌బ‌డి కొన‌సాగిన ఉన్న‌త స్థాయి సంబంధాలు పెద్ద‌గా ఫ‌లించ‌లేదంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఫ‌లితంగా భార‌త్ కంటే అధిక శాతం సుంకాల భారాన్ని మోయాల్సి వ‌స్తోంద‌ని వాపోతున్నారు. ఇక అక్క‌డి యువ‌తైతే పాక్ ప్ర‌భుత్వాన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ట్రంప్‌, మోదీ ఫొటోలు ఉన్న మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల‌ను షేర్ చేస్తూ.. భార‌తీయ వ‌స్తువుల‌పై సుంకాల‌ను 18 శాతానికి త‌గ్గించారు. అంటే పాకిస్థాన్ కంటే ఒక శాతం త‌క్కువ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

భార‌త్‌పై ప్ర‌శంస‌లు..

భార‌త్ నాయ‌క‌త్వం దేశం దాట‌కుండానే అద్భుతం చేసిందంటూ కొనియాడుతున్నారు. ట్రంప్ ప‌ట్ల అతిగా గౌర‌వం చూపించ‌కుండానే భార‌త్ మెరుగైన ఫ‌లితాల‌ను సాధించ‌గ‌లిగింద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. పాక్‌ను చ‌ట్ట‌విరుద్ధ‌మైన‌, మురికి ప‌నులు చేసే ఉంపుడుగ‌త్తెలా ట్రంప్ చూశార‌ని దుమ్మెత్తి పోస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పరిస్థితిని ఒక 'నిస్సహాయ ప్రేమికుడి'తో పోలుస్తూ డిజిటల్ క్రియేటర్ వజాహత్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాక్ అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Advertisement
Advertisement