త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran | మా మౌలిక స‌దుపాయాల‌పై దాడి చేస్తే.. హ‌ర్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్‌

Iran | హర్మూజ్​ జలసంధిని 48 గంటల్లో తెరవాలని, లేదంటే విద్యుత్ కేంద్రాల‌పై దాడులు చేస్తామ‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అల్టిమేటం జారీ చేయ‌డంపై ఇరాన్ (Iran) అంతే స్థాయిలో ప్ర‌తిస్పందించింది.

G

International | Published On Mar 23, 2026, 6.59 am IST

Iran | మా మౌలిక స‌దుపాయాల‌పై దాడి చేస్తే.. హ‌ర్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్‌
Advertisement

Iran | త్రినేత్ర‌.న్యూస్‌: హర్మూజ్​ జలసంధిని 48 గంటల్లో తెరవాలని, లేదంటే విద్యుత్ కేంద్రాల‌పై దాడులు చేస్తామ‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అల్టిమేటం జారీ చేయ‌డంపై ఇరాన్ (Iran) అంతే స్థాయిలో ప్ర‌తిస్పందించింది. అమెరికా త‌మ దేశ మౌలిక స‌దుపాయాల‌పై దాడి చేస్తే.. అమెరికా స్థావరాలకు ఆశ్రయం కల్పించే దేశాలు త‌మ ల‌క్ష్యాలు అవుతాయ‌ని ఇస్లామిక్ రెవ‌ల్యూష‌రీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చ‌రించింది. తాము పశ్చిమాసియా పశ్చిమాసియాలోని కీలక మౌలిక సదుపాయాలు, ఇంధన వనరులు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంటామ‌ని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ (Mohammad Baqer Qalibaf) స్ప‌ష్టం చేశారు. వాటిని కోలుకోలేని విధంగా ధ్వంసం చేస్తాం, దీంతో చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు భారీగా పెరిగే అవకాశం ఉంటుంద‌న్నారు.

ఇరాన్ 48 గంటల్లోగా హర్ముజ్ జ‌ల‌సంధిని (Strait of Hormuz) పూర్తిగా తెరవకపోతే, అమెరికా వారి విద్యుత్ కేంద్రాలను (Energy Facilities) ధ్వంసం చేస్తుందని డొనాల్డ్ హెచ్చరించారు. దేశంలోని అతిపెద్ద విద్యుత్ కేంద్రంపై మొద‌ట దాడికి దిగుతామ‌ని శ‌నివారం అల్టిమేటం జారీచేశారు. ప్ర‌తిగా ధ్వంస‌మైన‌ మా విద్యుత్ కేంద్రాలు మ‌ళ్లీ పూర్తిస్థాయిలో తెర‌చుకునే వ‌రకు హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని పూర్తిగా మూసివేస్తామ‌ని ఐఆర్‌జీసీ స్ప‌ష్టం చేసింది. ఇక ఇరాన్ ఖాదం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరి స్పందిస్తూ.. తమపై దాడి చేస్తే, ఇజ్రాయెల్​లోని అన్ని విద్యుత్ కేంద్రాలు, ఇంధన, సమాచార సాంకేతిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామ‌న్నారు. అమెరికన్ వాటాదారులున్న కంపెనీలను కూడా పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement