GHMC Meat Shop Closure | కృష్ణాష్టమి ఎఫెక్ట్: సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు బంద్
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హైదరాబాద్‌లో మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేస్తూ జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు, మాంసాహార ప్రియులు ఈ విషయాన్ని గమనించాలి.
- శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సెప్టెంబర్ 4, 2026న మాంసం దుకాణాల బంద్
- జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని కబేళాలు (స్లాటర్ హౌస్‌లు), బీఫ్, రిటైల్ మీట్ షాపులు మూసివేయాలని ఆదేశాలు
- జీహెచ్ఎంసీ యాక్ట్, 1955 కింద అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ ఆర్.వి.కర్ణన్
- ఆదేశాలు కచ్చితంగా అమలు చేసేలా పోలీసుల సహకారం కోరిన మున్సిపల్ కార్పొరేషన్
GHMC Meat Shop Closure | త్రినేత్ర.న్యూస్ : సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నగరవాసులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. పండుగ రోజున హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అన్ని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం (Meat), బీఫ్ (Beef) దుకాణాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది.
నిబంధనల ప్రకారం
కృష్ణాష్టమి పవిత్రతను, ప్రాముఖ్యతను గౌరవిస్తూ బల్దియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 533(బి) కింద అధికారిక నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 4వ తేదీన నగర పరిధిలో ఎక్కడా జంతువధ జరగకుండా, మాంసం విక్రయాలు సాగకుండా అధికారులు పర్యవేక్షించనున్నారు.
పోలీసుల సహకారం కోరిన కమిషనర్
ఈ బంద్ నిబంధనలను నగరంలో పక్కాగా అమలు చేసేందుకు మున్సిపల్ సిబ్బంది పోలీసుల మద్దతు తీసుకోనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్.. హైదరాబాద్ పోలీస్ అధికారులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. స్లాటర్ హౌస్‌లు, మాంసం దుకాణాల మూసివేతను సమర్థవంతంగా అమలు చేయడంలో తమ సిబ్బందికి పూర్తి బందోబస్తు, సహకారం అందించాలని పోలీసు కమిషనర్లను కోరారు.
వ్యాపారులు ఈ నిబంధనలు పాటించని పక్షంలో మున్సిపల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు




