IND Vs NZ | న్యూజిలాండ్ టార్గెట్ 256 రన్స్.. కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన సంజు, అభిషేక్, ఇషాన్..!
IND Vs NZ | టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల వరద పారించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి.. న్యూజిలాండ్‌కు 256 రన్స్ టార్గెట్ విధించింది.
Flash news | Published On Mar 8, 2026, 8.53 pm IST
IND Vs NZ | టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల వరద పారించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి.. న్యూజిలాండ్‌కు 256 రన్స్ టార్గెట్ విధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివరలో శుభమ్ దూబే మెరుపులు మెరిపించడంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. మ్యాచ్‌లో ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లను ఊచకోత కోశారు. పవర్ ప్లేలోనే టీమిండియా 92 పరుగులు చేశారు. ఈ టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక పవర్‌ప్లే స్కోరు రికార్డును శాంసన్, అభిషేక్ జోడీ సమం చేసింది. 2024 అఫ్ఘనిస్తాన్‌పై వెస్టిండీస్ జట్టు పవర్ ప్లేలో 92 రన్స్ చేసింది.
ఓపెనర్ల సరికొత్త రికార్డు..
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రికార్డును నెలకొల్పారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఓ జట్టు ఓపెనర్లు 50కిపైగా రన్స్ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి. గతంలో 2009లో లార్డ్స్‌లో శ్రీలంకపై కమ్రాన్ అక్మల్, షాజైబ్ హసన్ చేసిన 48 పరుగులే ఫైనల్‌లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. దాదాపు 17 సంవత్సరాల తర్వాత శాంసన్- అభిషేక్ జోడీ ఈ రికార్డును అధిగమించింది.
రాణించిన అభిషేక్
ఈ టీ20 వరల్డ్ కప్‌లో విఫలమైన అభిషేక్ శర్మ ఫైనల్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆ తర్వాత అవుట్ అయ్యాడు. మొత్తం 21 బంతులు ఆడిన ఈ ఓపెనర్ 52 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇందులో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నారు. టీ20 వరల్డ్ కప్‌లో దారుణ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ నరేంద్ర మోదీ స్టేడియంలో తన విశ్వరూపాన్ని చూపి విమర్శకులకు మరోసారి తన సత్తా ఏంటో చాటి చెప్పాడు.
సంజు శాంసన్ కీలక ఇన్నింగ్స్..
కీలకమైన టీ20 వరల్డ్ కప్‌లో సంజు శాంసన్ మరోసారి తన బ్యాటింగ్‌తో అలరించారు. సూపర్8 డూ ఆర్ డై మ్యాచ్‌లో వెస్టిండీస్, సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై అర్ధ సెంచరీలతో టీమిండియాను ఆదుకున్న ఈ కేరళ కుర్రాడు ఫైనల్‌లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా మూడోసారి అర్ధ సెంచరీ చేశాడు. 46 బంతులు ఆడిన సంజు 89 పరుగులు చేసి నిషమ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. సంజు ఇన్నింగ్స్‌లో ఎనిమిది సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నారు. అదే ఓవర్‌లో హాఫ్ సెంచరీ చేసి జోరుమీదున్న ఇషాన్ సైతం పెవిలియన్‌కు చేరాడు. అంతకు ముందు ఇషాన్ బ్యాట్‌తో అభిమానులను అలరించాడు. ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాడు. 25 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. ఆడిన తొలి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి డకౌట్‌గా వెనుదిరిగాడు.
కివీస్ ప్లాన్ విఫలం..
టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ చూసేందుకు చాలా బాగుందని.. పిచ్‌పై కొద్దిగా పచ్చిక ఉండడంతో ఆరంభంలో బౌలర్లకు ఏమైనా సహకారం లభిస్తుందేమో చూస్తామని తెలిపాడు. భారత జట్టులో పవర్ హిట్టర్లు చాలా మంది ఉన్నారని, వారిని నియంత్రించి, ఛేదించగల స్కోరుకు పరిమితం చేయడమే లక్ష్యమని తెలిపాడు. కెప్టెన్ తాము టాస్ ఓడినందుకు సంతోషంగానే ఉన్నామని, టాస్ గెలిచినా బ్యాటింగ్ ఎంచుకునేవాడమని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లతో సరికొత్త ప్రయోగం చేసింది. ప్రారంభంలో పలువురు బౌలర్లను మారుస్తూ టీమిండియా బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేయాలన్న ప్రణాళిక పారలేదు. తొలి ఓవర్‌లో మ్యాట్ హెన్రి వేయగా.. ఏడు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత పలువురు బౌలర్లను మారుస్తూ రాగా.. టీమిండియా ఓపెనర్లు విరుచుకుపడ్డారు. లాకీ ఫెర్గుసన్, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రి బౌలింగ్‌ను టీమిండియా బ్యాటర్లు ఉతికి ఆరేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్‌కి మూడు వికెట్లు పడగొట్టగా.. రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్నీకి ఒక్కో వికెట్ దక్కింది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



