త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Varanasi | అంటార్కిటికాలో మ‌హేష్‌బాబు వార‌ణాసి షూటింగ్ – ఫ‌స్ట్ ఇండియ‌న్ మూవీగా రికార్డ్‌

రిలీజ్‌కు ముందే మ‌హేష్‌బాబు వార‌ణాసి ఓ రేర్ రికార్డును నెల‌కొల్ప‌బోతుంది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలో జ‌రుగ‌నుంది. అంటార్కిటికాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనున్న ఫ‌స్ట్ ఇండియ‌న్ మూవీగా వార‌ణాసి నిల‌వ‌బోతుంది.

N

Entertainment | Published On Mar 2, 2026, 7.07 pm IST

Varanasi | అంటార్కిటికాలో మ‌హేష్‌బాబు వార‌ణాసి షూటింగ్ – ఫ‌స్ట్ ఇండియ‌న్ మూవీగా రికార్డ్‌
Advertisement

Varanasi |  మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ వ‌ర‌ల్డ్ మూవీ వార‌ణాసి. మైథ‌లాజిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో టైమ్ ట్రావెల్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ భారీ బ‌డ్జెట్ సినిమాతోనే గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇండియ‌న్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. హాలీవుడ్‌ను మించిపోయేలా ఐమాక్స్‌తో పాటు అత్యాధునిక సాంకేతిక‌త‌ను ఉప‌యోగిస్తూ రాజ‌మౌళి ఈ సినిమాను రూపొందిస్తోన్నారు. దాదాపు 1500 కోట్ల‌తో ఇండియాలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా వార‌ణాసి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ప్ర‌స్తుతం వార‌ణాసి షూటింగ్ జోర్డాన్‌లో జ‌రుగుతోంది. మ‌హేష్‌బాబుపై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను రాజ‌మౌళి షూట్ చేస్తున్నారు.

అంటార్కిటికాలో...

తాజాగా వార‌ణాసి మ‌రో రేర్ రికార్డ్‌ను నెల‌కొల్ప‌బోతుంది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలో ప్లాన్ చేశారు మేక‌ర్స్‌. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రియాంక చోప్రా లీక్ చేసింది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టించిన ది బ్ల‌ఫ్ మూవీ ఇటీవ‌ల ఓటీటీలో రిలీజైంది. జోర్డాన్ షెడ్యూల్ గ్యాప్‌లో ది బ్ల‌ఫ్ సినిమాను మ‌హేష్‌బాబు , రాజ‌మౌళి చూశార‌ట‌. ఈ సినిమాపై రివ్యూ కూడా ఇచ్చారు. యాక్ష‌న్, ఎమోష‌న్స్‌తో సినిమా అద్భుతంగా ఉంద‌ని మ‌హేష్‌బాబు అన్నాడు. ప్రియాంక చోప్రా త‌న యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టింద‌ని ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. మ‌హేష్‌బాబు ట్వీట్‌పై ప్రియాంక చోప్రా రిప్లై ఇచ్చింది. థాంక్యూ మ‌హేష్‌...త్వ‌ర‌లోనే అంటార్కిటికాలో క‌లుద్దాం అంటూ పేర్కొన్న‌ది. ప్రియాంక ట్వీట్ వైర‌ల్ అవుతోంది. వార‌ణాసి నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలో జ‌రుగ‌నున్న‌ట్లు త‌న ట్వీట్ ద్వారా ప్రియాంక హింట్ ఇచ్చింద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు.

ఫ‌స్ట్ ఇండియ‌న్ మూవీ...

ఇప్ప‌టివ‌ర‌కు అంటార్కిటికాలో ఒక్క ఇండియ‌న్ మూవీ షూటింగ్ కూడా జ‌ర‌గ‌లేదు. ఈ ఖండంలో షూటింగ్‌ను జ‌రుపుకోనున్న ఫ‌స్ట్ ఇండియ‌న్ మూవీగా వార‌ణాసి నిల‌వ‌బోతుంది. ఈ ఖండంలో మంచు కొండ‌ల నేప‌థ్యంలో కొన్ని కీల‌క స‌న్నిశాల‌ను రాజ‌మౌళి షూట్ చేయ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. అంటార్కిటికా షెడ్యూల్ మార్చి లేదా ఏప్రిల్‌లో మొద‌ల‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో మ‌హేష్‌బాబు, ప్రియాంక చోప్రాతో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం మొత్తం పాల్గొనే అవ‌కాశం ఉంద‌ట‌.

2027లో రిలీజ్‌...

ఈ ఏడాది జూన్‌లోగా వార‌ణాసి షూటింగ్ కంప్లీట్ కానున్న‌ట్లు స‌మాచారం. వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్‌తో కూడిన సినిమా కావ‌డంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ఎడెనిమిది నెల‌లు టైమ్ ప‌ట్ట‌వ‌చ్చ‌ని అంటున్నారు. 2027 మార్చి 7న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. వార‌ణాసిలో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

 

Advertisement
Advertisement