Krithi Shetty | బాలీవుడ్లో (Bollywood) సినిమాలు చేయాలని ప్రతి హీరోయిన్ కలలు కంటుంటారు. హిందీలో ఒక్క సినిమానైనా చేస్తేనే తమ కెరీర్‌కు కంప్లీట్‌నెస్ వచ్చినట్లు భావిస్తుంటారు. ప్రస్తుతం బాలీవుడ్లో సౌత్ హీరోయిన్లకు డిమాండ్ పెరిగింది. నయనతార, రష్మిక మందన్నతో పాటు పలువురు దక్షిణాది హీరోయిన్లు హిందీలో బ్లాక్‌బస్టర్స్‌తో అదరగొట్టారు. వారి బాటలోనే అడుగులు వేయాలని కలలు కన్నది ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి. టైగర్ ష్రాఫ్, విద్యుత్ జమ్వాల్ హీరోలుగా బాలీవుడ్లో ఓ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. మిలాప్ జవేరీ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టి హీరోయిన్గా ఎంపికైనట్లు కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఈ సినిమా ఆడిషన్స్ కోసం కృతి శెట్టి ముంబాయి వెళ్లడంతో ఆమె హిందీ ఎంట్రీ ఖాయమేనని అనుకున్నారు. త్వరలోనే ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టనుందని అనుకున్నారు. వా వాథియార్ రిజల్ట్... కానీ చివరి నిమిషంలో కృతిశెట్టికి మేకర్స్ షాకిచ్చారట. ఇటీవల రిలీజైన వా వాథియార్ రిజల్ట్‌తో పాటు అంతకుముందు ఎదురైన డిజాస్టర్స్ వల్లే కృతిశెట్టిని హిందీ సినిమా దర్శకనిర్మాతలు పక్కనపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కార్తీ హీరోగా ఇటీవల రిలీజైన తమిళ మూవీ వా వాథియార్లో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కార్తీ కెరీర్లోనే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సినిమాలో కృతిశెట్టి యాక్టింగ్‌పై కూడా విమర్శలొచ్చాయి. వా వాథియార్ కంటే ముందు కృతి శెట్టి నటించిన కస్టడీ, ది వారియర్, మాచర్ల నియోజకవర్గంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఫ్లాప్‌గానే నిలిచాయి. ఈ పరాజయాల కారణంగానే కృతిశెట్టికి వచ్చిన ఒక్క బాలీవుడ్ అవకాశం కూడా చేజారిందని ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేష్... కృతి శెట్టి స్థానంలో కీర్తి సురేష్‌ను తీసుకోవాలని డైరెక్టర్ మిలాప్ జవేరీ ఫిక్సయినట్లు సమాచారం. ఇప్పటికే కీర్తి సురేష్‌ను మేకర్స్ అప్రోచ్ అయ్యారట. కృతిశెట్టిని కాదని కీర్తి సురేష్ ఎంచుకోవడం బాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం తమిళంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది కృతిశెట్టి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై బోలెడు ఆశలు పెట్టుకుంది కృతిశెట్టి.