Web Series | వెబ్‌సిరీస్ బడ్జెట్ 46500 కోట్లు – ఒక్కో ఎపిసోడ్ ఖర్చు రాజమౌళి వారణాసి మూవీతో సమానం – ఆ సిరీస్ ఏదంటే?
హారీ పోటర్ వెబ్‌సిరీస్ బడ్జెట్ అభిమానులను షాకింగ్‌కు గురిచేస్తోంది. 46500 కోట్ల బడ్జెట్‌తో వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కోసమే 830 కోట్ల వరకు ఖర్చుచేస్తున్నట్లు సమాచారం.
Entertainment | Published On Mar 28, 2026, 6.20 pm IST
Web Series | వెబ్ సిరీస్‌ల కోసం మహా అయితే కోటి నుంచి రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తుంటారు నిర్మాతలు. అదే స్టార్ హీరోలు నటిస్తున్న సిరీస్ అయితే ఐదు నుంచి పది కోట్లు బడ్జెట్ అవుతుంది. కానీ ఓ హాలీవుడ్ వెబ్‌సిరీస్‌ను మేకర్స్ ఏకంగా 46500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్నారు. వరల్డ్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సిరీస్ మరేదో కాదు హ్యారీ పోటర్.
46500 కోట్లు...
హ్యారీ పోటర్ ఫ్రాంఛైజ్‌లో ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు వచ్చాయి. ఇవన్నీ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. వేల కోట్ల వసూళ్లను రాబట్టాయి. హ్యారీ పోటర్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వార్నర్ బ్రదర్స్ సంస్థ ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తోంది. ఈ ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్ కోసం 5.6 బిలియన్ డాలర్లు బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం. ఇండియన్ కరెన్సీలో ఈ సిరీస్ మొత్తం బడ్జెట్ 46500 కోట్లకుపైనేనట.
ఒక్కో ఎపిసోడ్‌కు...
ఒక్కో ఎపిసోడ్ కోసమే 100 మిలియన్ డాలర్టు (ఇండియన్ కరెన్సీలో 830 కోట్లు) వరకు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. వరల్డ్‌లోనే అత్యంత కాస్ట్‌లీ వెబ్‌సిరీస్ ఇదేనని నెటిజన్లు చెబుతోన్నారు.
హ్యారీ పోటర్ వెబ్‌సిరీస్ హెచ్‌బీవో మ్యాక్స్‌లో రిలీజ్ కాబోతుంది. క్రిస్మక్ కానుకగా డిసెంబర్‌లో ఈ హాలీవుడ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
11 వేల కోట్లతో...
హ్యారీ పోటర్ కోసం 11వేల కోట్లతో భారీ సెట్స్ వేశారట. ప్రత్యేకంగా ఓ నగరాన్నే రీక్రియేట్ చేశారట. ఇవన్నీ సిరీస్‌కు హైలైట్‌గా ఉండబోతున్నట్లు చెబుతోన్నారు.
మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో హారీ పోటర్‌గా డొమినిక్ మెక్ లాలిన్ నటిస్తున్నాడు. అలస్టైర్ స్టౌట్, అరాబెట్టా స్టాంటన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ మార్క్ మైలాడ్ హారీ పోటర్ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్రాన్సెస్కా గార్డినర్ షో రన్నర్‌గా వ్యవహరించబోతున్నారు.
సంబంధిత వార్తలు

Disha Patani | హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం.. స్పెషల్ శిక్షణ తీసుకుంటున్న హాట్‌బ్యూటీ దిశా పటానీ..!
మే 13, 2026

Movie Collections | 1400 కోట్లతో తీస్తే ఆరు కోట్లు వచ్చాయి… వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్ మూవీ ఇదే
మే 9, 2026

Ashu Reddy | అషు రెడ్డి ఎంగేజ్మెంట్ ఫొటోల వెనకున్న ట్విస్ట్ ఇదే – రియల్ కాదు…రీల్ లైఫ్‌లో…
మే 9, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



