త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Web Series | ఓటీటీలోకి ఛాంపియ‌న్ హీరోయిన్ త‌మిళ‌ వెబ్‌సిరీస్ – తెలుగులోనూ రిలీజ్ – షో ర‌న్న‌ర్‌గా అమ‌ర‌న్ డైరెక్ట‌ర్‌

ఛాంపియ‌న్ హీరోయిన్ అన‌స్వ‌ర రాజ‌న్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ల‌క్కీ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. అమ‌ర‌న్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ పెరియాసామి షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సిరీస్‌కు జియో హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

N

Entertainment | Published On Feb 1, 2026, 3.53 pm IST

Web Series | ఓటీటీలోకి ఛాంపియ‌న్ హీరోయిన్ త‌మిళ‌ వెబ్‌సిరీస్ – తెలుగులోనూ రిలీజ్ – షో ర‌న్న‌ర్‌గా అమ‌ర‌న్ డైరెక్ట‌ర్‌
Advertisement

Web Series |  అమ‌ర‌న్ మూవీతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ పెరియాసామి. శివ‌కార్తికేయ‌న్, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా దేశ‌భ‌క్తిప్ర‌ధానంగా తెర‌కెక్కిన ఈ సినిమా నాలుగు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ పెరియాసామి ఫ‌స్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించ‌బోతున్నారు. ల‌క్కీ పేరుతో పొలిటిక‌ల్ కామెడీ డ్రామాగా రూపొందుతోన్న ఈ సిరీస్ రిలీజ్ డేట్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక‌య్యాయి.

జియో హాట్ స్టార్‌లో...

ఈ త‌మిళ వెబ్‌సిరీస్‌లో జీవీ ప్ర‌కాష్‌కుమార్, మ‌ల‌యాళ హీరోయిన్ అన‌స్వ‌ర రాజ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ల‌క్కీ వెబ్‌సిరీస్‌కు రాజ్‌కుమార్ పెరియాసామి కేవ‌లం షో ర‌న్న‌ర్‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఉద‌య్ మ‌హేష్ ఈ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
ల‌క్కీ వెబ్‌సిరీస్ ఫిబ్ర‌వ‌రి 20 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో రిలీజ్ అవుతోంది. ఓ పోస్ట‌ర్ ద్వారా విడుద‌ల తేదీని జియో హాట్ స్టార్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

ఓటీటీలోకి ఎంట్రీ...

ఓ చిన్న కుక్క‌పిల్ల కార‌ణంగా విడిపోయిన ఓ కుటుంబం ఎలా ద‌గ్గ‌రైంది? ల‌క్కీ ఛార్మ్‌గా మారిపోయిన ఆ కుక్క‌ను ఓ పొలిటీషియ‌న్ ఎందుకు దొంగిలించాడు? ఆ కుక్క‌పిల్ల కోసం ఓ కుటుంబం ఎలాంటి రిస్క్ తీసుకుంది అనే అంశాల‌తో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్క‌నున్న‌ట్లు స‌మాచారం.
ల‌క్కీ వెబ్‌సిరీస్‌కు జీవీ ప్ర‌కాష్ కుమార్ స్వ‌యంగా మ్యూజిక్ అందించారు. ల‌క్కీ వెబ్‌సిరీస్‌తోనే జీవీ ప్ర‌కాష్ కుమార్‌, అన‌స్వ‌ర రాజ‌న్‌తో పాటు రాజ్‌కుమార్ పెరియాసామి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఛాంపియ‌న్ త‌ర్వాత‌...

అన‌స్వ‌ర రాజ‌న్ ఇటీవ‌లే ఛాంపియ‌న్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రోష‌న్ మేక హీరోగా న‌టించిన ఈ మూవ‌తోనే అన‌స్వ‌ర రాజ‌న్ టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా తొలి అడుగు వేసింది. ఛాంపియ‌న్ త‌ర్వాత ఈ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది అన‌స్వ‌ర రాజ‌న్‌.

Advertisement
Advertisement