Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం రిలీజ్‌లో కొత్త ట్విస్ట్ – రష్మిక మందన్నతో పోటీ!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో బాక్సాఫీస్ వద్ద అనుపమ పరమేశ్వరన్ పోటీపడబోతుంది. అనుపమ హీరోయిన్‌గా క్రేజీ కళ్యాణం మూవీ రిలీజ్ డేట్ ఛేంజ్ అయ్యింది. ప్రకటించిన డేట్ కంటే రెండు వారాల ముందే ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే రోజు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రణబాలి రిలీజ్ కూడా కాబోతుంది
Entertainment | Published On Oct 6, 2026, 5.01 pm IST
Anupama Parameswaran | లవ్ బ్రేకప్ బాధ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనుపమ పరమేశ్వరన్. తిరిగి యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టిన ఈ మలయాళ ముద్దుగుమ్మ కొత్త కథలు వింటోంది. ప్రస్తుతం తెలుగులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన భోగితో పాటు క్రేజీ కళ్యాణం సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో తెలంగాణ యువతిగా అనుపమ కనిపించబోతుంది.
రెండు వారాల ముందే...
క్రేజీ కళ్యాణం సినిమా రిలీజ్‌పై మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. ప్రకటించిన డేట్ కంటే రెండు వారాల ముందే ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాను తొలుత అక్టోబర్ 30న విడుదల చేయాలనుకున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ పోన్ అయ్యింది. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పెళ్లి కూతురు గెటప్‌లో అనుపమ కనిపిస్తోంది. ఆమె వెనుక...తరుణ్ భాస్కర్, సీనియర్ నరేష్, అఖిల్ టెన్షన్ పడుతున్నట్లుగా కనిపించడం ఆసక్తిని పంచుతోంది.
పెళ్లి వేడుక నేపథ్యంలో...
తెలంగాణ పెళ్లి వేడుక నేపథ్యంలో రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాకు భద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌కు జోడీగా అఖిల్ కనిపించబోతున్నాడు.
జైలర్, రణబాలి...
అక్టోబర్ 15న రజనీకాంత్ జైలర్ 2, అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రణబాలి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు పెద్ద సినిమాలకు అనుపమ పరమేశ్వరన్ ఏ మాత్రం పోటీ ఇస్తుంది? క్రేజీ కళ్యాణం సినిమాకు థియేటర్లు దొరుకుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
క్రేజీ కళ్యాణంతో పాటు శర్వానంద్ భోగిలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామర్ పాత్ర చేస్తోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్ 12న రిలీజ్ అవుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ – రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్
అక్టోబర్ 4, 2026

Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ – రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ – తెలంగాణ అమ్మాయిగా అనుపమ
అక్టోబర్ 4, 2026

Anupama Parameswaran | బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా – యాంకర్ ప్రశ్నకు వెరైటీగా సమాధానం చెప్పిన అనుపమ పరమేశ్వరన్
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Mumbai Ahmedabad Bullet Train | బుల్లెట్ రైలు ప్రాజెక్టులో బిగ్ ట్విస్ట్: జపాన్‌తో సిగ్నలింగ్ రగడ.. మేడ్ ఇన్ ఇండియా ట్రైన్‌తోనే తొలి జర్నీ!
- ●Indian Navy | సముద్రంలో నేవీ సింహగర్జన!
- ●Jio Platforms IPO | జియో ఐపీఓ విలువ రూ.11 లక్షల కోట్లు.. అతిపెద్ద లిస్టింగ్‌కు రెడీ..
- ●Singer Chinmayi | తెలుగు ఓటీటీ షోలో కంటెస్టెంట్‌గా సింగర్ చిన్మయి - బిగ్‌బాస్ కంటే డబుల్ ప్రైజ్‌మనీ
- ●Manne Krishank | మన్నె క్రిశాంక్‌కు షరతులు లేకుండా బెయిల్
- ●GST 2.0 Reforms | జీఎస్టీ 2.0 : ఏడాదికి ఒక్కసారే పన్నుల మార్పు.. వ్యాపారులకు ఇక మరింత ఊరట

Mumbai Ahmedabad Bullet Train | బుల్లెట్ రైలు ప్రాజెక్టులో బిగ్ ట్విస్ట్: జపాన్‌తో సిగ్నలింగ్ రగడ.. మేడ్ ఇన్ ఇండియా ట్రైన్‌తోనే తొలి జర్నీ!

Indian Navy | సముద్రంలో నేవీ సింహగర్జన!

Jio Platforms IPO | జియో ఐపీఓ విలువ రూ.11 లక్షల కోట్లు.. అతిపెద్ద లిస్టింగ్‌కు రెడీ..

Singer Chinmayi | తెలుగు ఓటీటీ షోలో కంటెస్టెంట్‌గా సింగర్ చిన్మయి - బిగ్‌బాస్ కంటే డబుల్ ప్రైజ్‌మనీ



