Murder | నడిరోడ్డుపై రియల్టర్ దారుణ హత్య
Murder | మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్ (Jawahar Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీ (Saket Colony)లో రియల్టర్ (Realtor) దారుణహత్యకు గురయ్యారు. ఆయనను అటకాయించిన దుండగులు తుపాకీతో కాల్చి, కత్తులతో పొడిచి చంపారు
Murder | తన పిల్లలను పాఠశాల వద్ద దింపి తిరుగు ప్రయాణమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి (Realtor) వెంకటరత్నం (46) దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన జవహర్‌నగర్ (Jawahar Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వెంకటరత్నంను సాకేత్ కాలనీ (Saket Colony)లోని ఫోస్టర్ బిల్లాబాంగ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో అటకాయించిన దుండగులు ముందుగా తుపాకీతో కాల్చి, కింద పడిపోయిన అతడిపై కత్తులతో మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు మరణించాడని నిర్ధారించుకున్న అనంతరం ఒక ఆటో, ఒక ద్విచక్రవాహనంపై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అక్కడి నుంచి బుల్లెట్‌తో పాటు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటరత్నంపై ధూల్‌పేట్ (Dhoolpet) లో రౌడీషీట్ (Rowdy Sheet) ఉన్నట్లు గుర్తించారు. గతంలో జంట హత్యల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ప్రత్యర్థులు చంపి ఉంటారా, ఆర్థిక లావాదేవీల కారణంగా హత్యకు గురయ్యారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






