త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | బ‌యోఫార్మా శ‌క్తి ప‌థ‌కం.. భారీగా పెరిగిన ఫార్మా షేర్ల ధ‌ర‌లు..

Union Budget 2026 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ‌ బడ్జెట్ 2026లో భారత్‌ను గ్లోబల్ బయోఫార్మా తయారీ కేంద్రంగా నిలబెట్టేందుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించడంతో ఫార్మా షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి.

S

Business | Published On Feb 1, 2026, 11.47 am IST

Union Budget 2026 | బ‌యోఫార్మా శ‌క్తి ప‌థ‌కం.. భారీగా పెరిగిన ఫార్మా షేర్ల ధ‌ర‌లు..
Advertisement

Union Budget 2026 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ‌ బడ్జెట్ 2026లో భారత్‌ను గ్లోబల్ బయోఫార్మా తయారీ కేంద్రంగా నిలబెట్టేందుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించడంతో ఫార్మా షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. ప్రభుత్వం బయోఫార్మా శక్తి అనే కొత్త పథకాన్ని ఈ సంద‌ర్భంగా ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో రూ.10వేల‌ కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీని లక్ష్యం బయోలాజిక్స్, బయోసిమిలర్స్ రంగాల్లో దేశీయ తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమేన‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు.

ఈ పథకం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, దిగుమతులపై ఆధారపడటం తగ్గడం, అధిక విలువ గల బయోఫార్మాసూటికల్ విభాగాల్లో భారత్ పోటీ సామర్థ్యం మెరుగుపడుతుందని అంచనా వేస్తున్న‌ట్లు వివ‌రించారు. కాగా ఈ ప‌థ‌కం ప్ర‌క‌ట‌న అనంత‌రం ఆదివారం నిర్వ‌హించిన ప్ర‌త్యేక ట్రేడింగ్ సెష‌న్‌లో ప‌లు ఫార్మా కంపెనీల షేర్ల ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌యం 11:15 గంట‌ల స‌మ‌యంలో బ‌యోకాన్ ఫార్మా కంపెనీ టాప్ గెయిన‌ర్‌గా నిలిచింది. ఈ కంపెనీ షేర్ల ధ‌ర‌ల్లో 2.5 శాతం పెరుగుద‌ల క‌నిపించింది. అలాగే పిరామాల్ ఫార్మా, సన్ ఫార్మా, టోరెంట్ ఫార్మా షేర్లు కూడా గ‌ణ‌నీయ‌మైన లాభాల‌తో ట్రేడ్ అయ్యాయి.

ప్రభుత్వ విధాన మద్దతు దేశీయ ఫార్మా కంపెనీలకు బలమైన వృద్ధి అవకాశాలను అందిస్తుందనే అంచనాతో మార్కెట్ వర్గాలు ఈ ప్రకటనను ఉత్సాహంగా స్వాగతించాయి. ముఖ్యంగా కాంప్లెక్స్ జనరిక్స్, బయోలాజిక్స్, కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో ప్రాధాన్యం ఉన్న కంపెనీలకు ఇది లాభదాయకంగా మారుతుందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement