SIP Vs Lumpsum | SIP వర్సెస్ లంప్‌సమ్.. 2026లో ఏది బెస్ట్?
SIP Vs Lumpsum | మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలిక సంపద సృష్టికి అత్యంత ప్రజాదరణ పొందుతున్న పెట్టుబడి మార్గాల్లో ఒకటిగా కొనసాగుతున్నాయి. అయితే ఇన్వెస్టర్లు సాధారణంగా రెండు ప్రధాన పద్ధతుల మధ్య ఎంపిక చేసుకుంటారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) లేదా లంప్‌సమ్ ఇన్వెస్ట్‌మెంట్. మార్కెట్ సైకిల్స్‌లో ఈ రెండింటి ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
SIP Vs Lumpsum | మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలిక సంపద సృష్టికి అత్యంత ప్రజాదరణ పొందుతున్న పెట్టుబడి మార్గాల్లో ఒకటిగా కొనసాగుతున్నాయి. అయితే ఇన్వెస్టర్లు సాధారణంగా రెండు ప్రధాన పద్ధతుల మధ్య ఎంపిక చేసుకుంటారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) లేదా లంప్‌సమ్ ఇన్వెస్ట్‌మెంట్. మార్కెట్ సైకిల్స్‌లో ఈ రెండింటి ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు SIP చేయాలా? లేక ఒకేసారి పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టాలా? అనే సందిగ్ధంలో ఉంటారు. ఎందుకంటే రాబడులు కేవలం ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్‌పైనే కాకుండా, పెట్టుబడి పెట్టిన సమయం, విధానంపైనా ఆధారపడి ఉంటాయి. 2026లో ఏ వ్యూహం మెరుగైన రాబడులు ఇవ్వగలదో తెలుసుకునే ముందు SIP, లంప్‌సమ్ మధ్య తేడాలు, వాటి పనితీరు, ఏ పరిస్థితుల్లో ఏది బెటర్ అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.
SIP అంటే..
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అంటే.. ఒక నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెల లేదా త్రైమాసికం వంటి నిర్దిష్ట వ్యవధిలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే విధానం. ఇది క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టే అలవాటును పెంచడంతో పాటు, రూపీ కాస్ట్ యావరేజింగ్, కంపౌండింగ్ ప్రయోజనాలతో దీర్ఘకాలంలో సంపదను పెంచడంలో సహాయపడుతుంది.
లంప్‌సమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే..
లంప్‌సమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం. SIPల మాదిరిగా విడతల వారీగా కాకుండా మొత్తం డబ్బును ఒకేసారి మార్కెట్‌లో పెట్టడం ఇందులో ముఖ్య లక్షణం. అదనపు నిధులు ఉన్నవారు, మార్కెట్ అవకాశాలను ఉపయోగించుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది అనుకూలంగా ఉంటుంది.
SIP, లంప్‌సమ్ మధ్య ప్రధాన తేడాలు..
పెట్టుబడి విధానం SIP లో నిర్ణీత మొత్తాన్ని రెగ్యులర్‌గా పెట్టాల్సి ఉంటుంది. అదే లంప్‌సమ్ అయితే మొత్తం డబ్బును ఒకేసారి పెట్టుబడి పెడతారు. SIP పెట్టేందుకు మార్కెట్ టైమింగ్ అవసరం లేదు. అదే లంప్‌సమ్ అయితే ఎంట్రీ టైమింగ్ కీలకంగా నిలుస్తుంది. అంటే ఫండ్ అధిక లాభాల్లో ఉన్నప్పుడు పెట్టుబడి పెడితే అనుకోని కారణాల వల్ల మార్కెట్లు పతనమైతే అప్పుడు భారీ ఎత్తున నష్టం వస్తుంది. అందువల్ల లంప్‌సమ్ మొత్తం పెట్టేముందు మార్కెట్ల పరిస్థితిని అంచనా వేయడం ముఖ్యం. ఇక SIPలో రిస్క్ స్థాయి స్వల్పకాలంలో కాస్త తక్కువగా ఉంటుంది. లంప్‌సమ్ అయితే తక్కువకాలంలో మార్కెట్ వోలటిలిటీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జీతభత్యాలు పొందేవారు, రెగ్యులర్‌గా ఇన్‌కమ్ వచ్చే వారికి SIP మంచి ఆప్షన్. అదనపు నిధులు ఉంటేనే లంప్‌సమ్‌లో పెట్టాలి. SIP లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. డబ్బును పొదుపు చేసే విధానం అవగాహనకు వస్తుంది. లంప్‌సమ్ అయితే మార్కెట్ లో వచ్చే హెచ్చు తగ్గులను తట్టుకునే ధైర్యం ఉండాలి.

ఎప్పుడు SIP, లంప్‌సమ్ పెట్టాలి..
వేతనం పొందేవారు నెలవారీ ఆదాయినికి అనుగుణంగా SIP ను ప్లాన్ చేయాలి. కొత్తగా పెట్టుబడి పెడితే ఒకేసారి పెద్ద మొత్తం పెట్టడం వల్ల స్వల్పకాలంలో వచ్చే హెచ్చుతగ్గుల పట్ల ఆందోళన చెందాల్సి ఉంటుంది. మార్కెట్ టైమింగ్ కేవలం లంప్‌సమ్‌కు మాత్రమే వర్తిస్తుంది. SIP కు కాదు. SIP ను నెలలో ఎప్పుడైనా ఆటో డెబిట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు. కానీ నెల చివర్లో అయితే మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు SIP మేలు చేస్తుంది. స్వల్పకాలిక లక్ష్యాలకు రిస్క్ తీసుకుంటే లంప్‌సమ్ పనిచేస్తుంది. SIP వల్ల వోలటైల్ మార్కెట్లలోనూ ఆందోళన చెందకుండా పెట్టుబడులు పెట్టవచ్చు. అదనపు నగదు ఉన్నవారు, రిస్క్ తీసుకోదలిస్తే లంప్‌సమ్‌లో పెట్టాలి. డబ్బు ఖాళీగా ఉండకుంటే వెంటనే పొదుపు ప్రారంభమవుతుంది. 10 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం పాటు లంప్‌సమ్ పెట్టదలిస్తే అప్పటి వరకు మార్కెట్లలో ఉండే హెచ్చు తగ్గులు, ఒడిదుడుకుల భయం, ఆందోళన తగ్గిపోతాయి.
మార్కెట్ మార్పులను తట్టుకునేవారు, తాత్కాలిక నష్టాలను భరించే సామర్థ్యం ఉన్నవారు లంప్‌సమ్ పెట్టవచ్చు. మార్కెట్‌లో ఎక్కువ కాలం పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుంది కనుక కంపౌండిగ్ ప్రభావం వెంటనే కనిపిస్తుంది. స్వల్పకాలంలోనూ అధిక లాభాలను లంప్‌సమ్ అందిస్తుంది. వాల్యుయేషన్స్ అనుకూలంగా ఉంటే, సరైన స్థాయిలో ఎంట్రీ తీసుకుంటే రాబడి అధికంగా ఉంటుంది.
SIP + లంప్‌సమ్ కలిపి పెట్టవచ్చా..
SIP, లంప్‌సమ్ కలయిక కూడా మంచి దీర్ఘకాలిక వ్యూహంగా నిలుస్తుంది. కొంత మొత్తాన్ని లంప్‌సమ్‌గా పెట్టి వెంటనే కంపౌండింగ్ ప్రయోజనం పొందవచ్చు. మిగిలిన మొత్తాన్ని SIP లేదా సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (STP) ద్వారా క్రమంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల మార్కెట్ టైమింగ్ రిస్క్ తగ్గడమే కాకుండా క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగుతుంది. ఉదాహరణకు మీ వద్ద ప్రస్తుతం రూ.10 లక్షలు ఉన్నాయని అనుకుందాం. అయితే ప్రతి నెల రూ.30వేలు మాత్రమే పెట్టుబడి పెట్టాలనుకుంటే, కొంత మొత్తాన్ని లంప్‌సమ్‌గా పెట్టి, మిగతా మొత్తాన్ని SIP లేదా STP ద్వారా క్రమంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది తక్షణ మార్కెట్ ఎక్స్‌పోజర్‌తోపాటు దీర్ఘకాలిక పెట్టుబడి క్రమశిక్షణ మధ్య సమతుల్యతను కల్పిస్తుంది.
2026లో ఏది బెస్ట్?
2026లో కూడా SIPలు సాధారణ ఇన్వెస్టర్లకు అత్యంత సురక్షితమైన, స్థిరమైన పెట్టుబడి మార్గంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో SIPలు రిస్క్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. మరోవైపు మార్కెట్ కరెక్షన్ల సమయంలో లేదా సరైన వాల్యుయేషన్స్ వద్ద లంప్‌సమ్ పెట్టుబడులు పెడితే భారీ రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకే పద్ధతిని ఎంచుకోవడం కంటే, ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం, మార్కెట్ పరిస్థితులను బట్టి SIP, లంప్‌సమ్ కలయికను ఉపయోగించడం అనేకమందికి మెరుగైన వ్యూహంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



