త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crude Oil | అమెరికా-ఇరాన్ యుద్ధం.. చ‌మురు ఉత్ప‌త్తిలో 50 బిలియన్ డాల‌ర్ల న‌ష్టం..

Crude Oil | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధం ప్రారంభం అయి దాదాపు 50 రోజులు గ‌డిచిన నేప‌థ్యంలో ప్ర‌పంచ ఇంధ‌న మార్కెట్‌పై అది తీవ్ర ప్ర‌భావం చూపించింది. ఉత్ప‌త్తి కాకుండా మిగిలిన క్రూడ్ ఆయిల్ విలువ 50 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగానే ఉంటుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

S

Business | Published On Apr 19, 2026, 3.37 pm IST

Crude Oil | అమెరికా-ఇరాన్ యుద్ధం.. చ‌మురు ఉత్ప‌త్తిలో 50 బిలియన్ డాల‌ర్ల న‌ష్టం..
Advertisement

Crude Oil | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధం ప్రారంభం అయి దాదాపు 50 రోజులు గ‌డిచిన నేప‌థ్యంలో ప్ర‌పంచ ఇంధ‌న మార్కెట్‌పై అది తీవ్ర ప్ర‌భావం చూపించింది. ఉత్ప‌త్తి కాకుండా మిగిలిన క్రూడ్ ఆయిల్ విలువ 50 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగానే ఉంటుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయితే ఈ ప్ర‌భావం కేవ‌లం కొద్ది నెల‌లే కాకుండా, కొన్ని సంవ‌త్స‌రాల‌పాటు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 28న ప్రారంభ‌మైన యుద్ధం కార‌ణంగా 500 మిలియ‌న్ల బ్యారెళ్ల‌కు పైగా చ‌మురు కండ‌న్సేట్ మార్కెట్ నుంచి మాయ‌మైంద‌ని కేప్ల‌ర్ డేటా వెల్ల‌డించింది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఇంధ‌న స‌ర‌ఫ‌రా అంత‌రాయంగా నిపుణులు పేర్కొంటున్నారు.

మార్కెట్‌లో 500 మిలియ‌న్ల బ్యారెల్స్ లోటు..

ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాకి మాట్లాడుతూ లెబ‌నాన్‌లో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం త‌రువాత హోర్ముజ్ జ‌ల‌సంధి తెరిచి ఉంద‌ని తెలిపారు. కానీ కొద్ది గంట‌ల్లోనే జ‌ల‌సంధిని మూసేశారు. అయితే అదే స‌మ‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ యుద్ధం త్వ‌ర‌లో ముగిసే అవ‌కాశం ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ స్ప‌ష్ట‌మైన టైమ్ లైన్‌ను వెల్ల‌డించ‌లేదు. మార్కెట్ నుంచి గల్లంతైన 500 మిలియన్ల చ‌మురు బ్యారెల్స్ అమెరికా నెల రోజుల ఆయిల్ డిమాండ్‌కు సమానం కాగా యూరప్ మొత్తం నెలకు పైగా అవసరమయ్యే ఇంధనం కూడా అంతే ప‌రిమాణంలో ఉంది. అలాగే ఇది అమెరికా సైన్యం ఆరు సంవత్సరాల ఇంధన వినియోగానికి సరిపోతుంది. అంతేకాకుండా ప్రపంచ షిప్పింగ్ అవసరాలను నాలుగు నెలల పాటు కొన‌సాగించ‌గ‌లిగే ప‌రిమాణంగా నిపుణులు చెబుతున్నారు.

భారీగా త‌గ్గిన చ‌మురు ఉత్ప‌త్తి..

ఈ పరిస్థితిపై విశ్లేష‌కుడు ఐన్ ఐన్ మోవాట్ మాట్లాడుతూ ఇది ప్రపంచవ్యాప్తంగా 10 వారాల విమానయాన అవసరాన్ని నిలిపివేసినట్టేన‌ని అన్నారు. లేదా ప్రపంచ రహదారి ప్రయాణం 11 రోజులు ఆగిపోయినట్టేన‌ని తేల్చారు. లేకపోతే ఐదు రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆయిల్ ను కోల్పోయిన‌ట్లే అని అన్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం గల్ఫ్ అరబ్ దేశాలు మార్చిలో రోజుకు సుమారు 8 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోల్పోయాయి. ఇది ఎగ్జాన్ మొబిల్‌, షెవ్రాన్ కలిపి ఉత్పత్తి చేసే స్థాయికి సమాన‌మ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, ఒమాన్ దేశాల నుంచి జెట్ ఫ్యూయల్ ఎగుమతులు భారీగా పడిపోయాయి. ఫిబ్రవరిలో 19.6 మిలియన్ బ్యారెల్స్ ఉండగా, మార్చి, ఏప్రిల్ మొదటి భాగంలో అది కేవలం 4.1 మిలియన్ బ్యారెల్స్‌కు పడిపోయింది.

స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ‌కు చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం..

క్రూడ్ ధరలు బ్యారెల్‌కు సగటున 100 డాల‌ర్ల వద్ద కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కొరత వల్ల సుమారు 50 బిలియన్ డాల‌ర్ల‌ ఆదాయం కోల్పోయినట్లేన‌ని విశ్లేషకుడు జోహన్నెస్ రాబాల్ పేర్కొన్నారు. అయితే ఉద్రిక్తతలు కొంత తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, సరఫరా పునరుద్ధరణ త్వరగా జరిగే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో గ్లోబల్ ఆన్‌షోర్ నిల్వలు ఇప్పటికే 45 మిలియన్ బ్యారెల్స్ మేర తగ్గాయి. మార్చి చివర నుంచి రోజుకు సగటున 12 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి అంతరాయం కొనసాగుతోంది. కువైట్, ఇరాక్‌లోని భారీ క్రూడ్ ఫీల్డ్స్ మళ్లీ సాధారణ ఉత్పత్తికి చేరుకోవడానికి నాలుగు నుంచి ఐదు నెలలు పట్టవచ్చని రాబాల్ తెలిపారు. ఇక ఖతార్‌లోని రాస్ లాఫాన్ ఎల్ఎన్‌జీ సముదాయం సహా ప్రాంతీయ రిఫైనరీలు దెబ్బతినడంతో, పూర్తి స్థాయి పునరుద్ధరణకు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement