Marigold Farming | బంతిపూల సాగు.. ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్న యువ రైతు
Marigold Farming | ఏ శుభకార్యం జరిగినా.. బంతి పూలకు( Marigold Flowers ) అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఆ బంతి పూలతోనే శుభకార్యం జరిగే ప్రాంతాన్ని అలంకరిస్తారు. అందుకే బంతిపూలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన బంతి పూల సాగు( Marigold Farming ) చేస్తూ ఓ యువ రైతు( Young Farmer ) ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్నాడు. మరి ఆ యువ రైతు గురించి తెలుసుకోవాలంటే రాజస్థాన్( Rajasthan ) వెళ్లాల్సిందే.
Agriculture | Published On Dec 15, 2025, 4.27 pm IST
Marigold Farming | రాజస్థాన్( Rajasthan ) లోని శికర్ జిల్లా( Sikar district )కు చెందిన సురేంద్ర కుమార్( Surendra Kumar ) కు 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో కొత్తగా ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో బంతి పూల సాగు( Marigold Farming ) పై అతని దృష్టి పడింది. దీంతో ఈ సాగు విధానానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెండున్నర ఎకరాల్లో బంతి పూల సాగు ప్రారంభించాడు. మిగతా ఏడున్నర ఎకరాల్లో పెసర్లు, వేరుశనగ, ఇతర తృణ ధాన్యాలను ఆర్గానిక్ వ్యవసాయ( Organic Farming ) పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు.
సేంద్రీయ పద్ధతుల్లో సాగు..
పదేండ్ల క్రితం పొలం బాట పట్టిన యువ రైతు సురేంద్ర కుమార్ కూడా ఇతర రైతుల మాదిరిగానే భారీ స్థాయిలో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఉపయోగించి సాగు చేశాడు. కానీ దిగుబడి అంతగా లేదు. నష్టాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో నాలుగేండ్ల క్రితం తన ఆలోచన మార్చుకున్నాడు. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతుల్లోనే వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా తన భూమిని వర్మీకంపోస్టు ద్వారా సారవంతం చేశాడు. ఆ తర్వాత సాగు చేయడం ప్రారంభించాడు. దీంతో దిగుబడి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా సురేంద్ర పొలంలో పండిన పూలకు, తృణ ధాన్యాలకు కూడా డిమాండ్ భారీగా ఉంది.
ఏడాదికి రెండు సార్లు బంతి పూల సాగు..
సురేంద్ర కుమార్ మొదటగా బంతిపూల సాగు చేశాడు. ఈ సాగు ఆరు నెలల పాటు మనకు దిగుబడిని ఇస్తుంది. అంటే ఆరు నెలల కాలం మనకు మొక్కలు పూలను ఇస్తూనే ఉంటాయి. ఏడాదంతా ఈ పూలకు భారీగా డిమాండ్ ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, మతపరమైన వేడుకలు, ఇతర శుభకార్యాల వేడుకలతో పాటు చివరకు అంతిమయాత్రకు కూడా ఈ పూలను వినియోగిస్తారు. దీంతో బంతిపూలకు కాలంతో పని లేకుండా ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఏడాదిలో రెండు సార్లు బంతి పూల మొక్కలను సురేంద్ర కుమార్ నాటుతుంటాడు. తొలి సాగు మే నెలలో ప్రారంభించి, రెండో సాగు అక్టోబర్ మాసంలో ప్రారంభిస్తాడు. అంటే ఆరు నెలలకు ఒకసారి పూల మొక్కల సాగు చేస్తాడు. ఒక్కసారి మొక్కలు నాటితే అవి ఆరు నెలల వరకు మనకు పుష్పాలను అందిస్తాయి.
డ్రిప్ ఇరిగేషన్‌తో..

వ్యవసాయంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్న యువ రైతు సురేంద్ర కుమార్.. డ్రిప్ ఇరిగేషన్‌ను అనుసరిస్తున్నాడు. ఈ విధానంతో పూల మొక్కల వేర్లకు నీరు నేరుగా అందుతుంది. దీంతో మొక్క ఎదుగుదలతో పాటు దిగుబడి అధికంగా ఉంటుంది.
ప్రతి రోజు 3 క్వింటాళ్ల పూలు అమ్మకం
సురేంద్ర కుమార్ ప్రతి రోజు జైపూర్, శికర్ మార్కెట్లకు బంతి పూలను తరలిస్తుంటాడు. రోజుకు 1.50 క్వింటాళ్ల నుంచి 3 క్వింటాళ్ల వరకు విక్రయాలు చేస్తుంటాడు. ఆ రోజు ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలను నిర్ణయిస్తుంటాడు. ఒక్కో కిలో పూలను రూ. 80 నుంచి రూ. 250 వరకు అమ్ముతుంటాడు. పండుగ రోజుల్లో అయితే ఈ ధర అంతకు మించి ఉంటుంది.
ఇతర పంటల సాగు..
బంతిపూలతో సాటు చామంతి పూలను కూడా పండిస్తున్నాడు యువ రైతు. పెసర్లు, వేరుశనగ, సజ్జలు, గోరుచిక్కుడు వంటి పంటలను కూడా పండిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నాడు. లాభాలు కూడా ఆర్జిస్తున్నాడు. ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులను అవలంభించడం వల్లే అదనపు ఆదాయం సమకూరుతుందని సురేంద్ర కుమార్ పేర్కొన్నాడు. సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల భూమి కూడా సారవంతం అవుతుందన్నాడు. నేలను కూడా కాపాడిన వాళ్లం అవుతామని యువ రైతు కుమార్ తెలిపాడు.
ఏడాదికి రూ. 30 లక్షల టర్నోవర్..
ఇక బంతి పూల సాగుతో నెలకు రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.80 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు సురేంద్ర కుమార్. ఇలా ఏడాదికి కేవలం బంతిపూలతోనే రూ. 20 లక్షల వరకు లాభాలు గడిస్తున్నాడు. తృణ ధాన్యాల పంటలతో మరో రూ. 10 లక్షల వరకు సంపాదిస్తూ.. ఏడాదికి రూ. 30 లక్షల టర్నోవర్‌కు ఎదిగాడు సురేంద్ర కుమార్.
సంబంధిత వార్తలు

Hydroponic Farm | హైడ్రోఫోనిక్ వ్యవసాయం.. ఎకరాకు రూ. 57 లక్షలు సంపాదిస్తున్న ఐఐఎం ఎంబీఏ గ్రాడ్యుయేట్
మే 19, 2026

NEET UG | రూ.10 లక్షలు పెట్టి పేపర్ కొంటే.. వచ్చింది 107 మార్కులే..
మే 17, 2026

NEET 2026 paper leak | నీట్ ప్రశ్నపత్రం లీక్..? అసలు పరీక్షా పత్రంతో సరిపోలిన మెటీరియల్లోని 140 ప్రశ్నలు
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



