త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రాజీవ్ గాంధీ స్ఫూర్తితో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలి: సీఎం రేవంత్‌

CM Revanth Reddy | రాజీవ్ గాంధీ స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని.. తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో సాంకేతికతను తీసుకొచ్చిన గొప్ప దార్శనీకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.

S

Telangana | Published On May 21, 2026, 1.35 pm IST

CM Revanth Reddy | రాజీవ్ గాంధీ స్ఫూర్తితో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలి: సీఎం రేవంత్‌
Advertisement
  • గాంధీ కుటుంబంతో తెలంగాణ‌కు అవినాభావ సంబంధం ఉంది
  • అది కుటుంబ సంబంధం కంటే ఎక్కువ‌
  • దేశానికి సాంకేతిక‌త‌ను ప‌రిచ‌యం చేసిన గొప్ప దార్శ‌నికుడు రాజీవ్‌గాంధీ
  • వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు

త్రినేత్ర‌.న్యూస్: రాజీవ్ గాంధీ స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని.. తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం రాజీవ్‌గాంధీ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేద‌న్నారు.

దేశానికి సాంకేతికను పరిచయం చేసి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ. దేశంలో సాంకేతికతను తీసుకొచ్చిన గొప్ప దార్శనీకుడు, దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడు, సరళీకృత విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన గొప్ప దార్శనీకుడు రాజీవ్ గాంధీ అని సీఎం కొనియాడారు.

సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయంతోనే తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణకు గాంధీ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉంది. అది కుటుంబ సంబంధం కంటే ఎక్కువ. తెలంగాణ ఉన్నంతవరకు ప్రజలు గాంధీ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకు రావాలి.
మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement