త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Un Employees | న‌వంబ‌ర్ 7న‌ మహాధర్నాకు నిరుద్యోగ యువత పిలుపు

Un Employees | తెలంగాణ‌లోని నిరుద్యోగ యువ‌త( Un Employees ) రాష్ట్ర ప్ర‌భుత్వంపై స‌మ‌రానికి సిద్ధ‌మైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ( Graduate MLC ) ఎన్నికల లోపు.. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

S

Telangana | Published On Oct 17, 2026, 2.10 pm IST

Un Employees | న‌వంబ‌ర్ 7న‌ మహాధర్నాకు నిరుద్యోగ యువత పిలుపు
Advertisement

Un Employees | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ‌లోని నిరుద్యోగ యువ‌త( Un Employees ) రాష్ట్ర ప్ర‌భుత్వంపై స‌మ‌రానికి సిద్ధ‌మైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ( Graduate MLC ) ఎన్నికల లోపు.. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 7వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాలో విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నిరుద్యోగ యువ‌త ప్ర‌ధాన డిమాండ్లు ఇవే..

  • మెగా డీఎస్సీ నోటిఫికేషన్
  • ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ నిర్వహణ
  • ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీ
  • ఏజెన్సీ ప్రాంతంలోని 29 సెక్టార్లలో ఉద్యోగాల భర్తీ
  • ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ల జారీ
  • ఉద్యోగ నియామక క్యాలెండర్ ప్రకటన
Advertisement
Advertisement