Shabbir Ali | ఆ ఆడియో క్లిప్ కల్పితమైనది.. టీపీసీసీ చీఫ్ నాకు సోదర సమానుడు
Shabbir Ali | ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆడియో క్లిప్ కల్పితమైనదని, నకిలీదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చెప్పారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆ క్లిప్‌ను సృష్టించారని అభిప్రాయపడ్డారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు షబ్బీర్ అలీ లిఖితపూర్వక వివరణ అందజేశారు.
- క్రమశిక్షణా కమిటీకి వివరణ ఇచ్చిన షబ్బీర్ అలీ
Shabbir Ali | త్రినేత్ర.న్యూస్: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆడియో క్లిప్ కల్పితమైనదని, నకిలీదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చెప్పారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆ క్లిప్‌ను సృష్టించారని అభిప్రాయపడ్డారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు షబ్బీర్ అలీ లిఖితపూర్వక వివరణ అందజేశారు. తనకు షోకాజ్ నోటీసు జారీ చేసేకంటే ముందే తాను ఆ క్లిప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు.
తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నానని చెప్పారు. తన ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు కొందరు ఈ కుట్రకు తెరతీశారని అభిప్రాయపడ్డారు. తప్పుడు ప్రచారాలను పార్టీ కార్యకర్తలు విశ్వసించకూడదని, త్వరలోనే అసలు కుట్రదారులు బయటపడతారని చెప్పారు. టీపీసీసీ చీఫ్ తనకు సోదర సమానుడని, ఆయన గురించి తానెక్కడా తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ మధ్య దూరం పెంచేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నానని, పార్టీకి నష్టం జరిగే పని తన ప్రాణం పోయినా చేయనని ఉద్ఘాటించారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 15, 2026

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
జూన్ 15, 2026

Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా ‘డ్యాన్సింగ్ డాఫోడిల్స్’!
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



