Mahesh Kumar Goud | మోదీది ఫాసిస్టు పాలన : మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | సర్( SIR )ను వ్యతిరేకిస్తూ టీ పీసీసీ( T PCC ) ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ అరెస్టులకు దారి తీసింది. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి లోక్‌భవన్( Lok Bhavan )కు ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ నేతలను ఖైరతాబాద్ చౌరస్తాలో అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసు స్టేషన్( Punjagutta Police Station )కు తరలించారు.
Mahesh Kumar Goud | త్రినేత్ర న్యూస్ : సర్( SIR )ను వ్యతిరేకిస్తూ టీ పీసీసీ( T PCC ) ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ అరెస్టులకు దారి తీసింది. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి లోక్‌భవన్( Lok Bhavan )కు ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ నేతలను ఖైరతాబాద్ చౌరస్తాలో అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసు స్టేషన్( Punjagutta Police Station )కు తరలించారు.
ఈ సందర్భంగా పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మోదీది ఫాసిస్టు పాలన అని మండిపడ్డారు. జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీఈసీ మోదీ, అమిత్ షా చెప్పినట్లు నాట్యం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 13 కోట్ల ఓట్లు తొలగించి బీజేపీకి లబ్ది చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఓట్ల తొలగింపు రాజ్యాంగానికి విఘాతమన్నారు. ఓట్ల తొలగింపు వల్లే బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఓటమి పాలైందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ ర్యాలీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్, వాకాటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Sharwanand | అచ్చ తెలంగాణ మాండలికంతో భోగి పాట - కమ్మరోళ్ల గంగగా శర్వానంద్
- ●Vakiti Srihari | పౌల్ట్రీ రంగ అభివృద్ధికి అండగా ప్రభుత్వం : మంత్రి వాకిటి
- ●Katrina Kaif | అలా అయితే ముందుకు వెళ్లలేం.. విమర్శకులకు కత్రినా కైఫ్ కౌంటర్!
- ●Jupally Krishna Rao | పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి
- ●Gadari Kishore | రాహుల్ లెక్క మేం నిరసనలు తెలపొద్దా రేవంత్?
- ●Asian Champions Trophy | ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ ఔట్!

Sharwanand | అచ్చ తెలంగాణ మాండలికంతో భోగి పాట - కమ్మరోళ్ల గంగగా శర్వానంద్

Vakiti Srihari | పౌల్ట్రీ రంగ అభివృద్ధికి అండగా ప్రభుత్వం : మంత్రి వాకిటి

Katrina Kaif | అలా అయితే ముందుకు వెళ్లలేం.. విమర్శకులకు కత్రినా కైఫ్ కౌంటర్!

Jupally Krishna Rao | పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి



