త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ప‌దేళ్ల‌లోనే దేశానికి మార్గ‌ద‌ర్శకంగా నిలిచిన తెలంగాణ : కేటీఆర్

KTR | మాజీ సీఎం కేసీఆర్ నాయక‌త్వంలో ప‌దేళ్ల‌లోనే తెలంగాణ దేశానికి మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక తెలంగాణ రాష్ట్ర‌మ‌ని ఆయ‌న కొనియాడారు.

S

Telangana | Published On Apr 5, 2026, 4.41 pm IST

KTR | ప‌దేళ్ల‌లోనే దేశానికి మార్గ‌ద‌ర్శకంగా నిలిచిన తెలంగాణ : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : మాజీ సీఎం కేసీఆర్ నాయక‌త్వంలో ప‌దేళ్ల‌లోనే తెలంగాణ దేశానికి మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక తెలంగాణ రాష్ట్ర‌మ‌ని ఆయ‌న కొనియాడారు. అమెరికాలోని కొలంబియా బిజినెస్‌ స్కూల్‌లో ఇండియా బిజినెస్‌ కాన్ఫరెన్స్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజపై ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అభివృద్ధిని కేటీఆర్ వివ‌రించారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు.. అద్భుత‌మైన పాల‌సీలు త‌యారు చేశాం. మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాం. పెట్టుబ‌డిదారుల్లో న‌మ్మ‌కాన్ని క‌ల్పించి.. ఐటీ, పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించింది. మా హ‌యాంలో ఐటీ ఎగుమ‌తులు 2.72 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగాయి. ఐటీ ఉద్యోగుల సంఖ్య దాదాపు 10 ల‌క్ష‌ల‌కు చేరుకుంద‌ని కేటీఆర్ తెలిపారు.

గ్లోబ‌ల్ ఐటీ దిగ్గ‌జాల‌కు హైద‌రాబాద్ న‌గ‌రం కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. అమెజాన్ లాంటి సంస్థ‌లు హైద‌రాబాద్‌లో త‌మ క్యాంప‌స్‌ల‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ప్ర‌పంచ వ్యాక్సిన్ల‌లో మూడో వంతు తెలంగాణ నుంచే ఉత్ప‌త్తి అవుతున్నాయి. ఏటా 10 బిలియన్‌ డోసుల వ్యాక్సిన్లను తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. బల్క్‌ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణదే అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం అని తెలిపారు. కాళేశ్వరం ప్రాఎక్టు ద్వారా ఏటా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.

కాన్ఫరెన్స్‌లో వ్యాపారం, ఆవిష్కరణలు, భవిష్యత్‌ విధానాలపై లోతైన చర్చ జరిగిందని కేటీఆర్‌ తెలిపారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు, నిపుణులతో జరిగిన సంభాషణలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి నమూనా అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement