త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | శివ‌రాత్రి సంద‌ర్భంగా బీహెచ్ఈఎల్ నుంచి శ్రీ‌శైలంకు ప్ర‌త్యేక బ‌స్సు

TGSRTC | శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శ్రీ‌శైలం గుడికి వెళ్లే భ‌క్తుల కోసం టీజీఎస్ఆర్‌టీసీ (TGSRTC ) బీహెచ్ఈఎల్ డిపో నుంచి ప్ర‌త్యేక బ‌స్సు న‌డ‌వ నుంది. ఈ మేర‌కు డిపో మేనేజ‌ర్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ బ‌స్సు 94920 స‌ర్వీస్ నెంబ‌ర్‌తో ఈ నెల 13న రాత్రి 10.30 గంట‌ల‌కు డిపో నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు.

A

Telangana | Published On Feb 6, 2026, 2.29 pm IST

TGSRTC | శివ‌రాత్రి సంద‌ర్భంగా బీహెచ్ఈఎల్ నుంచి శ్రీ‌శైలంకు ప్ర‌త్యేక బ‌స్సు
Advertisement

TGSRTC | త్రినేత్ర‌.న్యూస్ : శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శ్రీ‌శైలం గుడికి వెళ్లే భ‌క్తుల కోసం టీజీఎస్ఆర్‌టీసీ (TGSRTC ) బీహెచ్ఈఎల్ డిపో నుంచి ప్ర‌త్యేక బ‌స్సు న‌డ‌వ నుంది. ఈ మేర‌కు డిపో మేనేజ‌ర్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ బ‌స్సు 94920 స‌ర్వీస్ నెంబ‌ర్‌తో ఈ నెల 13న రాత్రి 10.30 గంట‌ల‌కు డిపో నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు. రామ‌చంద్రాపురం, బీరంగూడ‌, అశోక్‌న‌గ‌ర్‌, లింగంప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌, గుల్మోహ‌ర్ పార్క్ ఐలండ్‌, హెచ్‌సీయూ డిపో, మ‌సీద్ బండ‌, గ‌చ్చ‌బౌలి స్టేడియం, డీఎల్ఎఫ్‌, ఇందిరాన‌గ‌ర్‌, గ‌చ్చిబౌలి ఓఆర్ఆర్ జంక్ష‌న్‌, ఓఆర్ఆర్ మీదుగా ఉద‌యం నాలుగున్న‌ర గంట‌ల‌కు శ్రీ‌శైలం చేరుకుంటుంద‌ని పేర్కొన్నారు. ఈ స‌ర్వీసు బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్ సైట్ లేదా ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్‌చేసుకోవాల‌ని సూచించారు.

శ్రీ‌శైలం వెళ్లేందుకు కాలనీలు, క‌మ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ల‌లో క‌నీసం 30 మంది భ‌క్తులు ఉంటే వారి వ‌ద్ద‌కే బ‌స్సు పంపించే సౌక‌ర్యం క‌ల్పించిన‌ట్లు మేనేజ‌ర్ తెలిపారు. ఈ స‌ర్వీస్ విష‌యంలో ఏవైనా స‌ల‌హాలు, సూచ‌న‌లు, వివ‌రాల కోసం కార్యాల‌య ప‌నివేళ‌ల్లో 9959226149 కు ఫోన్ చేయాల‌ని సూచించారు.

Advertisement
Advertisement