త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Santhosh Kumar Joginipally | శమీ వృక్షానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొద్దాం.. ప్రతి ఆలయంలో మొక్కలను నాటుదాం: మాజీ ఎంపీ సంతోష్

జమ్మి చెట్టు అంతరించి పోకుండా వాటికి ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ (Santhosh Kumar Joginipally) పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శమీ మొక్కలను అన్ని గ్రామాల్లో, అన్ని ఆలయాల్లో నాటాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge)లో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కుడవెల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శమీ వృక్షాన్ని (Shami Vruksham) నాటారు.

G

Telangana | Published On Oct 9, 2026, 12.02 pm IST

Santhosh Kumar Joginipally | శమీ వృక్షానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొద్దాం.. ప్రతి ఆలయంలో మొక్కలను నాటుదాం: మాజీ ఎంపీ సంతోష్
Advertisement

Santhosh Kumar Joginipally | త్రినేత్ర న్యూస్‌: `శమీ శమీయతే పాపం.. శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని..`ఈ శ్లోకాన్ని పఠించి విజయ దశమి రోజు జమ్మి (Jammi Chettu) చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి కటాక్షంతో శత్రుభయం తొలగి విజయం చేకూరుతుందని, దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన జమ్మి చెట్టు అంతరించి పోకుండా వాటికి ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ (Santhosh Kumar Joginipally) పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శమీ మొక్కలను అన్ని గ్రామాల్లో, అన్ని ఆలయాల్లో నాటాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge).. `ఊరిఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జమ్మిచెట్టు` కార్యక్రమాన్ని వరుసగా ఆరో ఏడాది చేపట్టింది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కుడవెల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డితో క‌లిసి మాజీ ఎంపీ సంతోష్ శమీ వృక్షాన్ని (Shami Vruksham) నాటారు. అనంత‌రం `ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జ‌మ్మి చెట్టు` కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఆ తర్వాత కుకునూరుపల్లి మండల కేంద్రంలో వారాహి, ప్రత్యంగిరా ఆలయంలో మాజీ ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోడింటర్ చెప్యాల రాజేశ్వర్ రావు పాక్స్ వాయిస్ ఛైర్మెన్ పిస్కా అమరేందర్ శమీ వృక్షాన్ని నాటారు.

రాష్ట్ర వృక్షాన్ని కాపాడాలని..

శమీ వృక్షాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా కూడా గుర్తించింది. అయితే అనేక కారణాలతో ఈ జమ్మి చెట్టు అంతరించిపోతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ శమీ వృక్షం ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో ఉండేలా గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్ సంకల్పించి.. ఏడేండ్ల కిందట శమీ వృక్షాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది అన్ని గ్రామాలకు, దేవాలయాలకు జమ్మి మొక్కలను పంపిణీ చేయనున్నామని సంతోష్ కుమార్‌ ప్రకటించారు. ఆ బాధ్యతను తాము తీసుకుంటున్నామని చెప్పారు.

అది కేసీఆర్ ఆలోచనే..

తెలంగాణలో (Telangana) దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీ. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా (Dasara) నవరాత్రి ఉత్సవాల సందర్భంగా `ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు` (Ooru Vooruko Jammi Chettu and Gudi Gudi Ko Jammi Chettu) కార్యక్రమం మొదలవుతుందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టీమ్  ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాగానే రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును అప్ప‌టి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వేదకాలం నుంచీ నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ఊరిలో గుడిలో బడిలో భాగస్వామ్యం చేయాలన్న గొప్ప ఆలోచన చేసిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించారు. తమవంతుగా ప్రతీ ప్రాంతంలో జమ్మి మొక్క నాటేలా, రక్షించి పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

 

హరిత భారత్ కోసం అవిశ్రాంత కృషి
తెలంగాణ సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ గారి 2018లో గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ హరిత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ పర్యావరణ ఉద్యమం కోట్లాది విత్తనాలను అడవుల్లో నాటింది. యువత.. విద్యార్థులతో మమేకమై కోట్ల మొక్కలకు ప్రాణం పోసింది. ఈ ఉద్యమంలో యువత, ప్రజాప్రతినిధులు, ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్లు, పౌర సమాజాన్ని సైతం భాగస్వాములను చేసి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు భట్టు అంజిరెడ్డి జుబేర్ నాయకులు దేవి రవీందర్ మదసు శ్రీనివాస్ పుల్కంపల్లి నరేందర్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు భద్రప్ప అనంతుల ప్రశాంత్ సంపత్ సర్పంచులు మైపాల్ తదితరులు పాల్గొన్నారు

Advertisement
Advertisement