త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Alert | తెలంగాణకు వ‌ర్ష సూచ‌న‌..! ఆరెంజ్ అల‌ర్ట్ జారీ..!!

Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం చ‌ల్ల‌ని క‌బురు అందించింది. రాబోయే నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

S

Telangana | Published On Apr 28, 2026, 4.55 pm IST

Rain Alert | తెలంగాణకు వ‌ర్ష సూచ‌న‌..! ఆరెంజ్ అల‌ర్ట్ జారీ..!!
Advertisement

Rain Alert | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం చ‌ల్ల‌ని క‌బురు అందించింది. రాబోయే నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. మే 1వ తేదీ వ‌ర‌కు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు మోస్తరు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అత్య‌ధికంగా నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో చార్మినార్ ఏరియాలో 42.5 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, రంగారెడ్డి, వికారాబాద్, వ‌న‌ప‌ర్తి, నాగ‌ర్‌క‌ర్నూల్, న‌ల్ల‌గొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ అయింది. మ‌రో రెండు, మూడు గంట‌ల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ప‌లు ప్రాంతాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన కూడా కురిసే అవ‌కాశం ఉంది. గంట‌కు 41 నుంచి 61 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement