త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kancha Ilaiah | వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్ మ‌నువ‌డి పేరు..!

Kancha Ilaiah | వరంగల్ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి త‌న మ‌నువ‌డి పేరును నామ‌క‌ర‌ణం చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని బ‌హుజ‌న త‌త్వ‌వేత్త‌, ప్రొఫెస‌ర్ కంచ ఐల‌య్య పేర్కొన్నారు. ఇదే నిజమైతే రేవంత్ రెడ్డి మ‌ళ్లీ సీఎం అవ్వ‌డ‌మేమో కానీ, కాంగ్రెస్ పార్టీ పుట్టి మున‌గ‌డం ఖాయ‌మ‌ని ఐల‌య్య హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Sep 30, 2026, 3.39 pm IST

Kancha Ilaiah | వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్ మ‌నువ‌డి పేరు..!
Advertisement

మండిపడ్డ బహుజన తత్వవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య

Kancha Ilaiah | త్రినేత్ర న్యూస్ : వరంగల్ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి త‌న మ‌నువ‌డి పేరును నామ‌క‌ర‌ణం చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని బ‌హుజ‌న త‌త్వ‌వేత్త‌, ప్రొఫెస‌ర్ కంచ ఐల‌య్య పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టుకు నిన్న నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశం సంద‌ర్భంగా ది ప్రింట్‌లో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

2028లో ప్రారంభం కానున్న వరంగల్ ఎయిర్‌పోర్టులోని ఓ టెర్మినల్‌కు రేచర్ల రుద్రారెడ్డి పేరు పెట్టాలని, రేవంత్ రెడ్డి తన మనవడు రేయాన్స్ రుద్రాదేవ్ పేరును ఎయిర్‌పోర్టుకు పెట్టాలని భావిస్తున్నారనే ప్రచారం కాంగ్రెస్‌లోనే జరుగుతోందని ఆ కథనంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఇదే నిజమైతే రేవంత్ రెడ్డి మ‌ళ్లీ సీఎం అవ్వ‌డ‌మేమో కానీ, కాంగ్రెస్ పార్టీ పుట్టి మున‌గ‌డం ఖాయ‌మ‌ని ఐల‌య్య హెచ్చ‌రించారు. రేవంత్ రెడ్డి తన మనువ‌డి పేరును మామునూర్ ఎయిర్‌పోర్టుకు పెట్టడం అర్థంపర్థం లేని వ్యవహారం అని ఎద్దేవా చేశారు.

కంచ ఐల‌య్య మాట‌ల్లోనే..

"వరంగల్‌లోని మామునూర్ విమానాశ్రయం నిర్మాణం 2028 నాటికి గానీ పూర్తి కాదు.. కనీసం రన్‌వే నిర్మాణానికి సంబంధించిన టెండర్లు కూడా ఇంకా క్లియర్ కాకముందే దానికి ముందస్తుగా పేరు నిర్ణయించడం వెనుక రాజకీయ వ్యూహాలు కుటుంబ ప్రయోజనాలు పేరు ప్రతిష్టల కోణం, దాగి ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విమానాశ్రయానికి కాకతీయ గణపతిదేవుని కాలంలో సైన్యాధ్యక్షుడిగా పనిచేసి, ఆ తదుపరి కాలంలో రాజ్య పరిపాలన బాధ్యతలను చూసుకున్న " రేచర్ల రుద్ర రెడ్డి" పేరును ఖరారు చేయడం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. సీఎం తన మనవడికి "రేయాన్స్ రుద్ర దేవ్ రెడ్డి" అని పేరు పెట్టుకున్నారని, ఆ పేరులోని ‘రుద్ర’ అనే అంశానికి అనుగుణంగానే ఈ చారిత్రక నగర విమానాశ్రయానికి రేచర్ల రుద్ర రెడ్డి పేరును ఎంచుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి ముందస్తు నిర్ణయాలు, వ్యక్తిగత ప్రయోజనాల ఆధారంగా చేసే నామకరణాలు భవిష్యత్తులో ముఖ్యమంత్రి రాజకీయ స్థానానికే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఉనికికే తీవ్ర విఘాతం కలిగిస్తాయ‌ని ప్రొఫెసర్ కంచ ఐలయ్య పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement