త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Poojitha | బ‌రిలో 11 మంది.. అయినా విజ‌యం ఆమెదే.. ఐన‌వోలు అమ్మాయి లండన్‌లో కౌన్సిలర్‌

Poojitha | విదేశాల్లో స్థిర‌ప‌డిన తెలంగాణ పౌరులు ఉద్యోగాల్లోనే కాదు రాజ‌కీయాల్లోనూ రాణిస్తున్నారు. హ‌నుమ‌కొండ జిల్లా ఐనవోలుకు చెందిన పూజిత (Poojitha) లండన్‌లో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించారు.

G

Telangana | Published On May 10, 2026, 7.05 am IST

Poojitha | బ‌రిలో 11 మంది.. అయినా విజ‌యం ఆమెదే.. ఐన‌వోలు అమ్మాయి లండన్‌లో కౌన్సిలర్‌
Advertisement

Poojitha | త్రినేత్ర‌.న్యూస్‌: విదేశాల్లో స్థిర‌ప‌డిన తెలంగాణ పౌరులు ఉద్యోగాల్లోనే కాదు రాజ‌కీయాల్లోనూ రాణిస్తున్నారు. హ‌నుమ‌కొండ జిల్లా ఐనవోలుకు చెందిన పూజిత (Poojitha) లండన్‌లో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఐన‌వోలు మండ‌లం ఒంటిమామిడిపల్లికి చెందిన కడదూరి శ్రీనివాస్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసి లండన్‌లో ఉంటున్నారు.

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఉసిల్లపల్లికి చెందిన కొంకటి పూజిత బయోటెక్నాలజీ అభ్య‌సించేందుకు ఆరేండ్ల క్రితం లండ‌న్ వెళ్లారు. ఎంఎస్‌ పూర్తి చేసి అక్క‌డే ఉద్యోగం సంపాదించారు. ఈ క్ర‌మంలో లండ‌న్‌లోనే ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్‌తో పూజిత‌కు గత ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వివాహ‌మైంది. శ్రీనివాస్ కుటుంబానికి రాజ‌కీయ నేప‌థ్యం ఉండ‌టంతో.. ఈ క్ర‌మంలో మే 7న జరిగిన ఎన్నికల్లో న్యూహ‌మ్ బ‌రో రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ వార్డు కౌన్సిల‌ర్‌గా గెలిచారు. ది గ్రీన్ పార్టీ మ‌ద్ద‌తుతో వివిధ పార్టీల‌కు చెందిన 11 మంది అభ్యర్థులతో ఆమె పోటీ పడ్డారు. 4 సంవ‌త్స‌రాల పాటు ఆమె ప‌ద‌విలో ఉంటారు. ఈ మేర‌కు కుటుంబ స‌భ్యులు వెళ్ల‌డించారు.

 

Advertisement
Advertisement