త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Petrol | తెలంగాణ‌లో కావాల్సినంత పెట్రోల్ ఉంది.. ఆందోళ‌న అవ‌స‌ర‌మే లేదు

Petrol | తెలంగాణ‌లో డీజిల్, పెట్రోల్ సరఫరాపై వస్తున్న పుకార్లపై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కావాల్సినంత పెట్రోల్, డీజిల్ ఉంద‌ని, వాహ‌న‌దారులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని మంత్రి ఉత్త‌మ్ స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Apr 29, 2026, 4.43 pm IST

Petrol | తెలంగాణ‌లో కావాల్సినంత పెట్రోల్ ఉంది.. ఆందోళ‌న అవ‌స‌ర‌మే లేదు
Advertisement

Petrol | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో డీజిల్, పెట్రోల్ సరఫరాపై వస్తున్న పుకార్లపై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కావాల్సినంత పెట్రోల్, డీజిల్ ఉంద‌ని, వాహ‌న‌దారులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని మంత్రి ఉత్త‌మ్ స్ప‌ష్టం చేశారు.

ప్రజలకు కావల్సినంత ఇంధనం అందుబాటులో ఉన్నది. పుకార్లను నమ్మి ఆందోళనకు గురి కావొద్ద‌ని మంత్రి సూచించారు. ఇంధన సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామ‌న్నారు. ఫిర్యాదుల కోసం 1967 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అంత‌ర్ రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. వ్య‌వసాయ అవసరాలకు అవసరమైన డీజిల్ సరఫరాకు ప్రత్యేక దృష్టి సారించామ‌న్నారు. ఎప్పటికప్పుడు జిల్లాల స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంద‌న్నారు. రోజుకు పెట్రోల్, డీజిల్ క‌లిపి 36,404 కేఎల్ స‌ర‌ఫ‌రా ఉంద‌న్నారు. స‌గ‌టున రోజువారీ మీద 175 శాతం అధికంగా ఇంధ‌న స‌ర‌ఫ‌రా ఉందని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement