KTR vs Seethakka | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసి తీరుతాం.. కేటీఆర్‌కు సీతక్క కౌంటర్
KTR vs Seethakka | ఈ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసి తీరుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ప్రతిసారి మహిళలను ఎగతాళి చేయడం, వారిని బద్నాం చేయడం సరికాదని సీతక్క మండిపడ్డారు.
KTR vs Seethakka | త్రినేత్ర.న్యూస్ : ఈ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసి తీరుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ప్రతిసారి మహిళలను ఎగతాళి చేయడం, వారిని బద్నాం చేయడం సరికాదని సీతక్క మండిపడ్డారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి సభలో నాటి గవర్నర్ తమిళిసై ప్రసంగంలో మహిళలకు ఒక లక్షా కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పించారు. నిన్నటి ప్రసంగంలో వడ్డీ లేని రుణం ప్రస్తావనే లేదు. ఆ పదమే మాయమైంది. ఆ స్కీం ఎత్తేస్తున్నారా..? మహిళా సంఘాలకు రూ.2 వేల కోట్లు బాకీ ఉన్నారు. ఇస్తారా ఇయ్యార చెప్పాలి. నిన్నటి ప్రసంగంలో మహిళా సంఘాలకు లక్ష కోట్లు అన్నారు కానీ వడ్డీ లేని రుణం అనే పదం లేకుండా జాగ్రత్త పడ్డారు. అందాల పోటీలు నిర్వహించి.. మిస్ ఇంగ్లండ్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె వెళ్లిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు అని కేటీఆర్ ప్రశ్నించారు.
దీంతో వెంటనే మంత్రి సీతక్క కలగజేసుకుని.. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇప్పటివరకు మహిళా సంఘాలకు ఈ రెండు సంవత్సరాల్లో రూ. 57 వేల కోట్ల రుణాలు ఇప్పించాం. మహిళా రుణాలకు సంబంధించి రూ. 1390 కోట్లు ఇప్పటివరకు మహిళలకు వడ్డీలు చెల్లించాం. మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో బతికే మహిళలకు మా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అని సీతక్క స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుంది. గత పదేండ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది. రూ. 3 వేల కోట్ల వడ్డీలను మహిళలపై భారంగా మోపింది బీఆర్ఎస్. మహిళలకు ఇవ్వాల్సిన రూ. 3000 కోట్ల వడ్డీలను చెల్లించకుండా మోసం చేసింది. ఆడబిడ్డలు రూపాయి రూపాయి పోగేసి ఆదా చేసుకున్న అభ్యాస నిధులను గత ప్రభుత్వం కాజేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు బీఆర్ఎస్ నెరవేర్చలేదు. మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నారు 10 సంవత్సరాల్లో చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామన్నారు.. కానీ కట్టించలేదు. మహిళలకు వడ్డీ లేని రుణాలపైన నిష్ఠూరాలు ఎందుకు..? మా ప్రభుత్వంపై మాట్లాడే ముందు మీరు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారు దానికి సమాధానం చెప్పాలి. సమ్మక్క సారలమ్మ జాతరలో మహిళా సంఘాలకు రూ. 6 కోట్లతో షాప్స్ పెట్టించాము.. మూడున్నర కోట్లు లాభం పొందారు. గతంలో ఐదు లక్షల రుణాల వరకు వడ్డీలను లిమిట్ చేస్తూ హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఐదు లక్షలకు మించి రుణాలకు కూడా వడ్డీలు చెల్లించాలని అడగటం విడ్డూరం. భవిష్యత్తులో ఐదు లక్షలకు మించి రుణాలకు కూడా వడ్డీలు చెల్లించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం అని సీతక్క తెలిపారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



