త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Prem Sagar Rao | కాంగ్రెస్ పార్టీ బ‌తక‌దు.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగ‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MLA Prem Sagar Rao | ఫిరాయింపు నాయకులను నమ్మితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చచ్చిపోతుంది అని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగ‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఉంది కాబ‌ట్టే వాళ్లు అవ‌కాశ‌వాదుల్లా వ‌చ్చారు.. వాళ్లను నమ్మి అసలైన కాంగ్రెస్ నాయకులను దూరం పెడితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బ‌త‌క‌దు అని ఆయ‌న తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Apr 3, 2026, 3.42 pm IST

MLA Prem Sagar Rao | కాంగ్రెస్ పార్టీ బ‌తక‌దు.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగ‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

MLA Prem Sagar Rao | త్రినేత్ర‌.న్యూస్ : ఫిరాయింపు నాయకులను నమ్మితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చచ్చిపోతుంది అని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగ‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఉంది కాబ‌ట్టే వాళ్లు అవ‌కాశ‌వాదుల్లా వ‌చ్చారు.. వాళ్లను నమ్మి అసలైన కాంగ్రెస్ నాయకులను దూరం పెడితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బ‌త‌క‌దు అని ఆయ‌న తేల్చిచెప్పారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశానికి ప్రేమ్ సాగ‌ర్ రావు హాజ‌రై మాట్లాడారు.

టీ పీసీసీ అధ్య‌క్షుడిని, ఇంచార్జి మంత్రిని కోరేది ఒక్క‌టే. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ వారికి స‌ముచిత స్థానం క‌ల్పించండి. కొత్త‌గా వ‌చ్చిన వారికి ఎల‌క్ష‌న్ ముందు వ‌చ్చిన వారికి, ఎల‌క్ష‌న్ త‌ర్వాత వ‌చ్చిన వారికి పెత్త‌నం ఇస్తే కాంగ్రెస్ పార్టీ బ‌త‌క‌దు.. ఇది ముందు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు వ‌చ్చిన వారంతా పార్టీ మీద ప్రేమ‌తో కానీ, ప‌ని చేద్దామ‌నే ఉద్దేశంతో కానీ రాలేదు. అధికారం ఉంది కాబ‌ట్టి వాళ్లు వ‌చ్చారు. అధికారి మార్పిడి జ‌రిగితే అంద‌రూ వెళ్లిపోతారు. ఎవ‌రైతే పార్టీ కోసం ప‌ని చేస్తున్నారో ఆ కార్య‌క‌ర్త‌లే మిగిలి ఉంటారు. కార్య‌క‌ర్త‌లే పార్టీ కోసం ప‌ని చేస్తారు.. మ‌ళ్లీ వారే క‌ష్ట‌ప‌డుతారు. పార్టీ కోసం ప‌ని చేస్తున్న వారిని గుర్తించండి.. గౌర‌వించండి. పార్టీ ప‌ద‌వుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో స‌రైన అవ‌కాశాలు ఇవ్వండ‌ని పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు ప్రేమ్ సాగ‌ర్ రావు సూచించారు.

Advertisement
Advertisement